ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి ముమైత్‌ఖాన్. 'హెజా' అనే హారర్ చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 'యాక్షన్ త్రీడీ', 'చందమామ కథలు' చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ.. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ సంగీత దర్శకుడు, దర్శకుడిగా పనిచేస్తున్నాడు. నూతన్ నాయుడు, ప్రీతం నిగమ్ ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ చివరిదశలో ఉంది.
"ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంగీతమందించాను. తొలిసారి హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది." -మున్నా కాశీ, దర్శకుడు, హీరో
ఇది చదవండి: చిందేసిన 'ఓ బేబీ' చిత్రబృందం
- " class="align-text-top noRightClick twitterSection" data="">