కట్టిపడేసే కొంటె చూపులు, ఆకర్షించే అందచందాలతో గతంలో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి రంభ. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు 'మహాసముద్రం' చిత్రంలో రంభపై ఓ పాట రాశారు. 'మందే ఇక మనదే.. విశాఖపట్నం బీచ్.. తాగొచ్చు.. ఊగొచ్చు.. ఏదైనా చేయొచ్చు. కొట్టేయ్.. జై కొట్టేయ్ మనమంత రంభ ఫ్యాన్సు.. కట్టేద్దాం బ్యానర్సు.. పెట్టేద్దాం కటౌట్సు' అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ను శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ ఆలపించిన ఈ పాటకు శర్వానంద్, జగపతిబాబు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ సంగీత ప్రియుల్ని ఆకర్షిస్తోంది. 'ఆర్‌ఎక్స్ 100' చిత్రంతో విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి రెండో చిత్రంగా 'మహా సముద్రం' తెరకెక్కుతోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైదరీ కథానాయికలు. జగపతిబాబు, రావు రమేశ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గుండెల్లో కన్నీటి మేఘం'
మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్ కలిసి నటిస్తున్న చిత్రం 'డియర్ మేఘ'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం నుంచి 'గుండెల్లో కన్నీటి మేఘం' అనే లిరికల్ సాంగ్‌ను శనివారం(ఆగస్టు 7) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అరుణ్ దాస్యం దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.
'బ్లాక్' టీజర్
యువకథానాయకుడు ఆది సాయికుమార్, దర్శనా బానిక్ జంటగా చిత్రం 'బ్లాక్'. జి.బి.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ కథానాయకుడు సుధీర్ బాబు శనివారం(ఆగస్టు 7) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
'వెన్నెల్లో ఆడపిల్ల'
నితిన్ 'మాస్ట్రో' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు లిరికల్స్ సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇప్పుడీ సినిమా నుంచి 'వెన్నెల్లో ఆడపిల్ల' ఫుల్వీడియోను శుక్రవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హిందీ హిట్ 'అంధాధున్' రీమేక్‌గా దీనిని తీశారు. నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు.
వర్కింగ్ స్టిల్స్
నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఆర్చరీ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధిచిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఇదీ చూడండి.. హాట్ పోజులతో కట్టిపడేస్తోన్న శిల్పా మంజునాథ్