ETV Bharat / sitara

పాన్​ ఇండియా పుణ్యం.. ఎక్కడైనా ఉంటాం

ప్రాంతీయ భాషల్లో అలరించే తారలు బాలీవుడ్​లో ఒక్క ఛాన్స్​ వస్తే చాలు.. మళ్లీ సొంత భాషా చిత్రాలపై కన్నెత్తి చూడరు. అయితే ఇది గతం. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల పుణ్యమంటూ కథానాయికలు రూట్​ మార్చారు. అటూ బాలీవుడ్​లోనూ ఇటు దక్షిణాది చిత్రాల్లోనూ మెరవడానికి సిద్ధమైపోతున్నారు. అవకాశం ఎక్కడి నుంచి వచ్చినా చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి భామలపై ఓ లుక్కేద్దాం.

Pan india cinema Effect
ఆడా ఉంటాం... ఈడా ఉంటాం
author img

By

Published : Mar 1, 2020, 9:54 AM IST

Updated : Mar 3, 2020, 1:04 AM IST

సినిమాకైనా... తారలకైనా... ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడమే లక్ష్యం. బాలీవుడ్‌లో నటిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. పారితోషికం కూడా ఎక్కువే అందుతుంది. అందుకే తారల్లో చాలా మంది హిందీ చిత్రపరిశ్రమ వైపే చూస్తుంటారు. సొంత భాషలో అభిమానుల్ని అలరిస్తే చాలనే ఆలోచనతో కనిపించిన హీరోలు కూడా ఇటీవల హిందీ వైపు చూస్తున్నారు. దీన్నిబట్టి ఆ మార్కెట్‌ వాళ్లని ఎంతగా ఊరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కసారి అక్కడికి వెళ్లారంటే ఇక తిరిగి రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలా ఒక్క అవకాశంతో మొదలుపెట్టి... ఛలో ముంబయి అంటూ మకాం మార్చేసిన నాయికలు చాలామందే. అక్కడ అవకాశాలు తగ్గాక కానీ... ఇటువైపు చూసేవాళ్లు కాదు. కానీ ఇటీవల ఆ ధోరణికి భిన్నంగా అడుగులేస్తున్నారు. మేం ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం అంటూ రెండు చోట్లా మెరిసేందుకు ఆసక్తి చూపుతున్నారు కొందరు నవతరం నాయికలు. వారిలో పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కియారా అడ్వాణీ, తాప్సీ, తమన్నా వంటి వాళ్లు ఉన్నారు.

అటు నుంచే వచ్చింది...

కియారా అడ్వాణీ బాలీవుడ్​ నుంచి వచ్చింది. తెలుగులో తొలి ప్రయత్నంగా చేసిన 'భరత్‌ అనే నేను'తో ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ'లో నటించింది. ప్రస్తుతం తనకు హిందీలో బోలెడన్ని అవకాశాలు. అయినా సరే... దక్షిణాదిలో నటించేందుకు సై అంటోంది. మహేష్‌తో మరోసారి కలిసి నటించడానికి ఇప్పటికే ఓకే చెప్పేసింది.

" తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఫిదా అయిపోయా. నేను కనిపించానంటే చాలు... నా సినిమాల్లోని పాత్రల పేర్లతో పిలుస్తుంటారు. ఆ అభిమానం కోసమైనా.. తెలుగులో ఏడాదికో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా"

-కియారా అడ్వాణీ, కథానాయిక.

Pan india cinema Effect
కియారా అడ్వాణీ

విలక్షణ కథానాయికగా..

తాప్సీ కూడా హిందీలో బిజీ బిజీ అయిపోయింది. అక్కడ నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తోందామె. అయినా సరే అప్పుడప్పుడు దక్షిణాదిలో మెరుస్తుంటుంది. గతేడాది 'గేమ్‌ ఓవర్‌' చిత్రంతో అలరించింది.

"నాకు సినిమా అంటే ఏంటో నేర్పింది తెలుగు చిత్రసీమే. స్థానికంగా ఉంటే బాగుంటుందనే కోణంలో ఆలోచించే ముంబయి వెళ్లాను తప్ప... తెలుగు సినిమాకి నేనెప్పుడూ దూరం కాలేదు. 'ఆనందోబ్రహ్మ', 'గేమ్‌ ఓవర్‌' సినిమాలు చేశానంటే కారణం అదే. నటించినా, నటించకపోయినా దక్షిణాది కథలు తరచూ వింటుంటా"

-తాప్సి, కథానాయిక.

Pan india cinema Effect
తాప్సీ

సమయం ఉంది మిత్రమా..

రెండు సినిమాలు చేతిలో ఉన్నాయంటే.. మూడో సినిమా చేసే తీరిక మాకు లేదనే కథానాయికలే ఎక్కువ. పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాత్రం సమయపాలనలో ఆరి తేరారు. నాలుగు సినిమాలైనా అవలీలగా చేసేస్తాం అంటున్నారు. అందుకే వాళ్లు ఎక్కడ మంచి అవకాశం వచ్చినా వదులుకోకుండా నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలతో జోష్​ మీదుంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఒప్పుకుంది. తెలుగులో నితిన్‌తో కలిసి 'చెక్‌'లో నటిస్తోంది.

పూజా హెగ్డే ఇటీవల హిందీలో సల్మాన్‌ఖాన్‌ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఇక తెలుగులో ప్రభాస్‌, అఖిల్‌ లాంటి కథానాయకులతో కలిసి నటిస్తోంది.

"నటిగా నాకు పేరొచ్చింది తెలుగు చిత్రాలతోనే. ప్రేక్షకులు ఎప్పుడో నన్ను సొంత మనిషిలా స్వీకరించారు. అందుకే నా తొలి ప్రాధాన్యం తెలుగుకే ఇస్తుంటా. ఈమధ్య తెలుగు కథలు కట్టి పడేస్తున్నాయి. చేయనని చెప్పడానికి కారణాలేమీ కనిపించడం లేదు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?."

-పూజాహెగ్డే,కథానాయిక

Pan india cinema Effect
పూాజ హెగ్డే

ప్రత్యేకగీతమైనా చేస్తా...

ప్రస్తుతం తమన్నా తెలుగులో 'సీటీమార్‌' చిత్రంలో గోపీచంద్‌తో కలసి నటిస్తోంది. అంతేకాకుండా హిందీలో 'బోలే చూడియాన్‌' అనే చిత్రం చేస్తోంది. వీలునప్పుడల్లా టాలీవుడ్​లో ప్రత్యేకగీతాల్లోనూ కనిపించేందుకు ఈ అమ్మడు ముందుకొస్తోంది.

"ఒక్కో చోట నుంచి ఒక్కో రకమైన కథలొస్తుంటాయి. అలాంటప్పుడు ఎందుకు వాటిని దూరం చేసుకోవాలి? తెలుగులో చేయలేకపోయిన కథల్ని హిందీలో చేసే అవకాశం నాకు వచ్చింది. అంతే తప్ప ఒక భాషలో నటిస్తున్నామంటే మరో భాషకి దూరమవుతున్నట్టు కాదు.

-తమన్నా, కథానాయిక

Pan india cinema Effect
తమన్నా

పాన్‌ ఇండియా సినిమాల ప్రభావమే...

డిజిటల్‌ వేదికలు అందుబాటులోకి వచ్చాక భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఏ భాషలో నటించినా.. ఆ సినిమా బాగుందంటే, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకూ చేరువవుతోంది. అందుకే కథానాయికలు ఇప్పుడు భాష గురించి ఆలోచించడం లేదు. మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా, చేయడానికి సిద్ధపడుతున్నారు.

ఈమధ్య పాన్‌ ఇండియా సినిమాల జోరు కూడా ఎక్కువైంది. చిత్రాలకు మరిన్ని హంగులు జోడించి జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు. పేరుకు ప్రాంతీయ భాషల్లోనే సినిమాలు రూపొందుతున్నా.. అవి జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. హిందీలో అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న శ్రద్ధా కపూర్‌, ఆలియాభట్‌ తదితర భామలు తెలుగు సినిమాలు ఒప్పుకుంటున్నారంటే కారణం అదే.

ఇదీ చూడండి : హీరో-విలన్​ ముద్దుతో 'మాస్టర్​' చిత్రీకరణ పూర్తి

Last Updated : Mar 3, 2020, 1:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.