కన్నడ సినీపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారమే ప్రస్తుతం హాట్‌టాపిక్. ఇందులో భాగంగా హీరోయిన్ రాగిణి సహా పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నటి సంయుక్త హెగ్డేకు కూడా దానితో సంబంధం ఉందన్నారు. పబ్లిక్ పార్క్‌లో పట్టపగలే సామాజిక కార్యకర్తలమంటూ ఆమెపై అసభ్యపదజాలంతో మాటల దాడికి పాల్పడ్డారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇలానా బట్టలు వేసుకునేది?
బెంగళూరులోని ఓ పార్కులో ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసులు బోధిస్తుంటుంది సంయుక్త. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ.. 'బట్టలు ఇలానా వేసుకునేది?', 'డ్రగ్స్ ముఠాతో ఈమెకు లింక్ ఉంది' అంటూ సదరు నటిని అసభ్యపదజాలంతో దూషించింది. ఆమెకు మద్దతుగా నిలిచిన మరికొందరు యువకులు సంయుక్తపై దాడికి యత్నించారు. తక్షణమే పోలీసులు రావడం వల్ల గొడవ సద్దుమణిగింది. ఈ తతంగాన్ని అంతటినీ ఫోన్లో వీడియో తీసిన సంయుక్త దానిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తనను వేధింపులకు గురిచేయడం బాధగా ఉందని పేర్కొంది.
2018లో నిఖిల్ హీరోగా వచ్చిన 'కిరాక్ పార్టీ' సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తమిళంలో 'కోమలి', 'పప్పీ' చిత్రాల్లోనూ కథానాయికగా కనిపించింది.
ఇదీ చూడండి డ్రగ్స్ కేసులో నటి రాగిణి అరెస్ట్