ETV Bharat / sitara

'అల్లు అర్జున్​ నా క్రష్.. ఆ వార్తలు చూసి నవ్వుకుంటా'

'తిమ్మరుసు', 'ఎస్​ఆర్ కళ్యాణ మండపం'(kalyanamandapam movie) సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాల్లోనూ నటించింది హీరోయిన్ ప్రియాంకా జావల్కర్. ఈ సినిమాలపై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండగా.. ప్రియాంక తన అనుభవాలను పంచుకుంది.

priyanka jawalkar instagram
ప్రియాంకా జావల్కర్
author img

By

Published : Aug 11, 2021, 7:15 AM IST

Updated : Aug 11, 2021, 8:12 AM IST

'టాక్సీవాలా' చిత్రం(taxiwala movie)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతపురం అమ్మాయి ప్రియాంకా జావల్కర్‌. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఆమె కాస్త విరామం తర్వాత ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు'(thimmarusu movie), కిరణ్‌ అబ్బవరంతో కలిసి 'ఎస్‌ఆర్‌.కళ్యాణ మండపం'(kalyanamandapam movie)లో నటించింది. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం వల్ల ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిందామె.. అవేంటో ఆమె మాటల్లోనే..

భయపడ్డాను కానీ..

priyanka jawalkar instagram
భయపడ్డాను కానీ..

'తిమ్మరుసు'కు మొదటిరోజే మంచి స్పందన వచ్చింది. 'ఎస్‌ఆర్‌.కళ్యాణమండపం' విడుదల రోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత మంచి ఆదరణ వస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ బాగానే ఉంటోంది. కలక్షన్స్‌ కూడా వస్తున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడం గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన గ్యాప్‌ గురించి కూడా ప్రస్తావించాలి. 2019లో ఒక సినిమా చేశాను. 2020లో 'తిమ్మరుసు'తో పాటు 'ఎస్‌ఆర్‌.కళ్యాణ మండపం' చేశాను. గతేడాది ఆగస్టులోనే 'ఎస్‌ఆర్‌.కళ్యాణమండంపం' విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల ఆలసమ్యమైంది. ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల కావడం వల్ల కొంచెం టెన్షన్‌ పడ్డాను. అసలు ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా..? అంత ధైర్యం చేస్తారా.? అనే అనుమానం ఉండేది. వారం రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. కానీ.. నా భయం నిజం కాలేదు. రెండు సినిమాలనూ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

బొద్దుగా ఉన్నానని..

priyanka jawalkar instagram
బొద్దుగా ఉన్నానని..

తిమ్మరుసు సినిమాలో బొద్దుగా ఉన్నానంటూ చాలామంది కామెంట్లు చేశారు. శరీరాకృతి, కెరీర్‌ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నా కెరీర్‌పై నాకంటే ఎక్కువ జాగ్రత్తలు ఎవరూ తీసుకోలేరు. నేనే కాదు ప్రతి ఒక్క మనిషి తన ఆరోగ్యం, భవిష్యత్తు గురించి తానే జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నాలో మార్పులు వచ్చాయి. వాటితో నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. డాక్టర్లను సంప్రదిస్తే.. థైరాయిడ్‌ అని చెప్పారు. ఆ కారణంగానే బరువు పెరిగాను. ఆ తర్వాత జిమ్‌లో వర్కౌట్‌లు చేసి మళ్లీ బరువు తగ్గాను. అయితే.. నా కెరీర్‌ విషయంలో అజాగ్రత్తగా లేనని చెప్పేందుకే ఆ రోజు వేదిక మీద 'నేను మోడల్‌ను కాదు.. నటిని' అని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే.. నిజ జీవితంలో ఉన్నదాని కంటే మన శరీరం కెమెరాలో 30శాతం భారీగా కనిపిస్తుంది. ఉన్నదున్నట్టుగా కనిపించాలంటే మనం సన్నగా ఉండాలి.

గ్యాప్‌ ఎందుకంటే..

priyanka jawalkar instagram
గ్యాప్‌ ఎందుకంటే..

ప్రతివారం ఎవరో ఒకరు కథ వినిపిస్తూనే ఉన్నారు. అయితే.. మనం చేసే సినిమా మంచి ఫలితాలు రాబట్టే విధంగా ఉండాలి. అప్పుడే నిర్మాతలు వాళ్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోగలరు. అలా ఆలోచించే నేను చేసే ప్రతి సినిమాను ఎంచుకుంటున్నాను. 'టాక్సీవాలా' తర్వాత మంచి స్క్రిప్టు దొరక్క ఎక్కువ గ్యాప్‌ వచ్చింది. దాదాపు 25 కథలు విన్నాను. తమిళం, కన్నడ కథలు కూడా విన్నాను. వచ్చే నెలలో ఇంకో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నింట్లో 'గమనం' కథ నాకు బాగా నచ్చింది. 'ఎస్‌ఆర్‌.కళ్యాణమండపం', 'తిమ్మరుసు'లో పాత్రలు కూడా ఛాలెంజింగ్‌గా ఉండటం వల్ల ఓకే చెప్పాను. 'గమనం' చిత్రీకరణ చివరి దశలో ఉంది. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోయాను. సోషల్‌మీడియాలో నాకు వీలైనంత వరకూ చేయగలిగాను.

ఇంకా కష్టపడాల్సి ఉంది..

'తిమ్మరుసు'లో ఇంకా కొంచెం కష్టపడి చేయాల్సిందేమోనని అనిపించింది. 'ఎస్‌ఆర్‌.కళ్యాణమండపం'లో బాగానే చేశాను. నా స్నేహితులు కూడా నాకు అదే చెప్పారు. నాకు డైరెక్టర్‌ ఎలా చెప్తే అలా చేస్తాను. అంతేకానీ.. విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌లాగా మానిటర్‌లో చూసి జడ్జిమెంట్‌ ఇవ్వలేను. నాకు గైడెన్స్‌ లేకుండా నేను ఏదీ చేయలేను. ఇప్పుడు కథలు వింటున్నాను. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశాను. ప్రొడక్షన్‌ హౌజ్‌ ఖరారు అయ్యాక ఆ సినిమా వివరాలు మీతో పంచుకుంటా. 'టాక్సీవాలా', 'తిమ్మరుసు', 'ఎస్‌ఆర్‌.కళ్యాణమండపం' మూడు మంచి విజయాలు అని చాలామంది అంటున్నారు. హ్యాట్రిక్‌ హిట్స్‌ అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఒకే వారంలో రెండు సినిమాలు విడుదల కావడం.. రెండూ మంచి ఆదరణ సొంతం చేసుకోవడం ఏ హీరోయిన్‌ విషయంలోనూ నేను చూడలేదు. సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు.

ఆయనంటే క్రష్..

priyanka jawalkar instagram
ఆయనంటే క్రష్..

'యూట్యూబ్‌ థంబ్‌నెయిల్‌లో నా గురించి వచ్చే వార్తలను చూసి నవ్వుకుంటా. మంచి గాసిప్స్‌ అయితే.. ఎంజాయ్‌ చేస్తూ.. నేనే నా స్నేహితులకు పంపిస్తూ ఉంటా' అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. అల్లు అర్జున్‌ అంటే క్రష్ అని చెప్పిన ఈ అమ్మడు.. మలయాళం చిత్రం 'ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌' అంటే బాగా ఇష్టమట. బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌ల కోసం ఆడిషన్స్‌ ఇస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చదవండి:'ఎన్టీఆర్​తో ఒక్క సీన్​ అయినా చేస్తే చాలు!'

Last Updated : Aug 11, 2021, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.