టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ తన తొలి సినిమా చిత్రీకరణ సమయంలో బాగా గుర్తుండిపోయిన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఆ మధురానుభావాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
"చాలానే ఉన్నాయి. నా తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రీకరణ హిందూపురం సమీపంలోని ఓ పల్లెటూరులో జరిగింది. ఆ సమయంలో అక్కడి ప్రజలు నా పట్ల చూపిన ప్రేమాభిమానాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లని చూస్తూ.. వాళ్లతో మాట్లాతున్న ఉత్సాహంలో చిన్న చిన్న సమస్యల్ని పక్కన పెట్టి చిత్రీకరణలో పాల్గొనేదాన్ని. ఓసారి నా కాలుకి దెబ్బ తగిలి బాగా రక్తం కారింది. కానీ, నా వల్ల చిత్రీకరణ ఆగకూడదని కట్టు కట్టుకొని కెమెరా ముందుకెళ్లా. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాక డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకున్నా. ఆ మర్నాడు మళ్లీ అదే కట్టుతో చిత్రీకరణలో పాల్గొన్నా. ఈ సినిమాతో తెరపైకి అడుగుపెట్టి అప్పుడే ఐదేళ్లు అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు."
-మోహరీన్, టాలీవుడ్ హీరోయిన్.
ఇటీవల 'ఎంత మంచివాడవురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెహరీన్. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చూడండి చిరు బర్త్డే: 'పునాదిరాళ్లు' నుంచి ఏమాత్రం తగ్గని 'మెగా' జోరు