ETV Bharat / sitara

సల్మాన్​తో ఉన్న బంధంపై మాట్లాడిన హీరోయిన్!​ - సల్మాన్​తో ఉన్న బంధంపై మాట్లాడిన హీరోయిన్​

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ తనకు మార్గదర్శకుడని​ వెల్లడించింది కథానాయిక అథియా శెట్టి. సల్మాన్​ నిర్మాతగా వ్యవహరించిన 'హీరో' సినిమాతో కథానాయికగా పరిచయమైందీ భామ.

Heroine  reveals his relationship with Salman Khan
సల్మాన్​తో ఉన్న బంధంపై మాట్లాడిన హీరోయిన్​
author img

By

Published : May 29, 2020, 6:45 PM IST

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో తాను ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నానని సునీల్‌ శెట్టి కుమార్తె, నటి అథియాశెట్టి తెలిపింది. సల్మాన్‌ నిర్మాతగా వ్యవహరించిన 'హీరో' సినిమాతో ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. తనని వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత సల్మాన్‌ఖాన్‌తో ఉన్న అనుబంధం గురించి అథియ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"నేను వెండితెరకు పరిచయమైన 'హీరో' చిత్రానికి సల్మాన్‌ నిర్మాత. 2015లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ సల్మాన్‌తో మాట్లాడుతున్నా. ఆయన నాకో మెంటార్(మార్గదర్శకుడు)‌. అందుకే ఏ విషయంలోనైనా సలహాలు అవసరమైతే వెంటనే సల్మాన్‌ని సంప్రదిస్తా. ఆయన కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు. టాలెంట్‌ను ప్రోత్సహిస్తారు".

-అథియాశెట్టి, కథానాయిక.

Athiya Shetty
అథియాశెట్టి

అనంతరం తన తండ్రి సునీల్‌ శెట్టితో కలిసి నటించడం గురించి ఆమె స్పందించింది. "నాన్నతో కలిసి వెండితెరపై సందడి చేయాలని ఉంది. మంచి స్క్రిప్ట్ వస్తే భవిష్యత్తులో తప్పకుండా నాన్నతో కలిసి నటిస్తా. కాకపోతే అది తండ్రీకూతుళ్ల చిత్రం లేదా ఫన్నీ చిత్రం అయి ఉండాలి" అని అంది అథియా.

ఇది చూడండి : కత్తెర పట్టిన నవనీత్ కౌర్.. భర్తకు కటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.