యువహీరోలు వరుణ్ తేజ్ - నితిన్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ శత్రువులుగా మారబోతున్నారు. అయితే నిజ జీవితంలో కాదులేండి.. అది కేవలం బాక్సాఫీస్ పోరు కోసమే.
వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ సంబంధించిన కథలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. మరోవైపు నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చేస్తున్నాడు. ఇప్పుడీ రెండు సినిమాలు, ఒకే రోజున బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు.. జులై 30న బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నాయట. గతంలో రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ఈ తేదీని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తేదీకి మంచి ప్రచారం దక్కింది. అందుకే అదే రోజును తమ చిత్రాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రావొచ్చు.
ఇదీ చూడండి.. ఆ విషయంలో హీరోయిన్ కంటే ప్రదీప్‌కు భయమెక్కువ!