ఆకాశం నీ హద్దురా సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు నటుడు సూర్య. తాను నటించే సినిమాల్లో ప్రేక్షకుల భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మునుపెన్నడూ తాను బయోపిక్‌లో నటించలేదని, ఈ సినిమాలో ఆ అవకాశం రావడం చాలా గొప్ప విషయమని అన్నాడు.
"ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర అయిన 'సింప్లీ ఫ్లై' అనే నవల ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమా చిత్రీకరించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుధా కొంగరా... నటుడిగా నన్ను ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసింది. మాంజీ, మేరీకోమ్ జీవిత చరిత్రలపై వచ్చిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం" .
- సూర్య, కథానాయకుడు
సినిమా నిర్వచనమే మార్చేసింది...
ఈ ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యమైందని నటుడు సూర్య తెలిపాడు. డిజిటల్ మాధ్యమం... సినిమా విజయానికి నిర్వచనమే మార్చేసిందని అన్నాడు.
సినిమా విజయం సాధించడం అంటే... ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు కాదని, ప్రేక్షకులపై అది చూపే ప్రభావమని వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి:మరణించడంలోనూ హాలీవుడ్ నటుడు రికార్డు