యువహీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ముంబయి పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. అక్కడికి దగ్గరల్లోని ఓ ద్వీపంలో చిత్రీకరణ కోసం వెళ్తుండగా, విజయ్‌కు ఓ చిన్న ప్రమాదం తప్పింది. జెట్టీ దగ్గర నడుస్తూ, జారిపడబోయాడు. వెనుకున్న సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పాన్ ఇండియా కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్. చార్మి, పూరీ జగన్నాథ్‌తో పాటు కరణ్ జోహార్ నిర్మాణంలో పాలు పంచుకున్నాడు.