ETV Bharat / sitara

తొలి ఉద్యోగం చేస్తున్న రోజులు గుర్తొచ్చాయి: సూర్య - suriya cinema news

'ఆకాశం నీ హద్దురా' చిత్రీకరణ సమయంలో తన తొలి ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయని హీరో సూర్య చెప్పారు. అందుకే హావభావాలు పలికించగలిగానని తెలిపారు.

hero suriya about his first salary
హీరో సూర్య
author img

By

Published : Nov 21, 2020, 2:32 PM IST

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. చాలాకాలం తర్వాత నటుడిగా సూర్య పూర్తిస్థాయిలో మెప్పించాడని సినీ ప్రియులు అంటున్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, సూర్య నటనను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కాక ముందు తాను ఏం చేశాననే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

hero suriya about his first salary
హీరో సూర్య

"ఆకాశం నీ హద్దురా' చిత్రంలో నేను పోషించిన పాత్ర.. వ్యక్తిగతంగా నాకెంతో దగ్గరైంది. ఒక్కప్పటి రోజుల్ని నాకు గుర్తు చేసింది. మా నాన్నగారు సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ నేను ఈ రంగంలోకి వస్తానని అనుకోలేదు. నా కాళ్లపై నేను నిలబడాలని మా ఇంట్లోవాళ్లు భావించారు. అందుకే డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేశాను. నెలరోజులపాటు పనిచేసినందుకుగాను రూ.736 జీతంగా ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. 'ఆకాశం నీ హద్దురా' చిత్రీకరణ సమయంలో ఆనాటి రోజులు నాకు బాగా గుర్తుకువచ్చాయి. దానివల్లే భావోద్వేగాలను మరింత బాగా పలికించగలిగానని అనుకుంటున్నాను. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు హావభావాలు పలికించే విషయంలో సుధా కొంగర ఎంతో సాయం చేశారు. నాలోని నటుడిని మరో కోణంలో నాకు పరిచయం చేసిన సుధకు థ్యాంక్స్‌' అని సూర్య తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.