ETV Bharat / sitara

'అల్లూరి' డైలాగ్​తో కృష్ణకు యువహీరో విషెస్ - కృష్ట పుట్టినరోజు

'అల్లూరి సీతారామరాజు' డైలాగ్​ను ఏకపాత్రాభినయం చేసి, సూపర్​స్టార్ కృష్ణకు పుట్టినరోజు విషెస్ చెప్పారు కథానాయకుడు, ఆయన అల్లుడు సుధీర్​బాబు.

Hero Sudheer Babu Wishes to Superstar Krishna in Different way
'అల్లూరి సీతారామరాజు'కు శుభాకాంక్షలు తెలిపిన సుధీర్​బాబు
author img

By

Published : May 31, 2020, 11:07 AM IST

సూపర్​స్టార్​ కృష్ణ.. నేడు తన 77వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినూత్నరీతిలో శుభాకాంక్షలు చెప్పారు హీరో సుధీర్​బాబు. కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు'లోని డైలాగ్​ను ఆపకుండా చెప్పి.. ఆ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఇందులో ఓవైపు కృష్ణ విజువల్​ వస్తుండగా, మరోవైపు సుధీర్​బాబు డైలాగ్​ చెబుతూ కనిపించారు. కొన్నిరోజుల క్రితం నందమూరి తారకరామారావు 'దానవీర శూరకర్ణ' సినిమాలోని భారీ డైలాగ్​ను ఇదే తరహాలో చెప్పి ఆకట్టుకున్నారీ కథానాయకుడు.

లాక్​డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న సుధీర్​.. శారీరక వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు, డబ్​ష్మాస్​లను అభిమానులతో పంచుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో ఇతడు కలిసి నటించిన 'వి' సినిమా విడుదల కావాల్సి ఉంది.

ఇదీ చూడండి... 'దానవీర శూరకర్ణ' డైలాగ్​తో అదరగొట్టిన యువహీరో ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.