కథానాయకులను శక్తిమంతమైన ప్రతినాయకులుగా చూపించడం దర్శకుడు బోయపాటి శ్రీనుకే చెల్లింది. ఇప్పటికే 'లెజండ్'తో జగపతిబాబు, 'వినయ విధేయ రామ'తో వివేక్ ఒబెరాయ్, 'సరైనోడు'తో ఆదిపినిశెట్టిని విలన్లుగా మార్చేసి మెప్పించారు. ఇప్పుడిదే పంథాలో మరో హీరోను ప్రతినాయకుడిగా మార్చేందుకు సిద్ధమయ్యారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'బీబీ3' (వర్కింగ్టైటిల్) సినిమా తీస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్ ఓ కీలకపాత్రలో నటించనున్నారని గతంలో ప్రచారం జరిగింది. బుధవారం శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో బాలకృష్ణ-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసినట్టే! అయితే ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారా? అనే దానిపై స్పష్టత రాలేదు.
-
Wishing @actorsrikanth A very Happy Birthday. Have a great year ahead.#HBDSrikanth#BB3onMay28th #NandamuriBalakrishna @ItsMePragya @BoyapatiSrinu @MusicThaman @dwarakacreation pic.twitter.com/8FncDpR0Mp
— Dwaraka Creations (@dwarakacreation) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing @actorsrikanth A very Happy Birthday. Have a great year ahead.#HBDSrikanth#BB3onMay28th #NandamuriBalakrishna @ItsMePragya @BoyapatiSrinu @MusicThaman @dwarakacreation pic.twitter.com/8FncDpR0Mp
— Dwaraka Creations (@dwarakacreation) March 23, 2021Wishing @actorsrikanth A very Happy Birthday. Have a great year ahead.#HBDSrikanth#BB3onMay28th #NandamuriBalakrishna @ItsMePragya @BoyapatiSrinu @MusicThaman @dwarakacreation pic.twitter.com/8FncDpR0Mp
— Dwaraka Creations (@dwarakacreation) March 23, 2021
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అందులో ఒకటి అఘోరా గెటప్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు బోయపాటి శ్రీను.
ఇదీ చూడండి: కొవిడ్ టీకా తీసుకున్న నటుడు సంజయ్ దత్