ETV Bharat / sitara

సవాల్ లేకపోతే సంతృప్తి దొరకదు: సత్యదేవ్ - స్కైలాబ్ మూవీ సత్యదేవ్

satyadev interview: నటుడిగా తాను చేసే పాత్రల్లో సవాల్ లేకపోతే సంతృప్తి దొరకదని సత్యదేవ్ అన్నారు. ఆయన నటించి 'స్కైలాబ్' రిలీజ్​ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

hero satyadev
హీరో సత్యదేవ్
author img

By

Published : Dec 1, 2021, 7:31 AM IST

satyadev new movie: 'నాకెప్పుడు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు తిడతారు. అందుకే వాళ్ల ఊహలకు అందని విధంగా ప్రతిసారి విభిన్నమైన పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తుంటా" అని అన్నారు కథానాయకుడు సత్యదేవ్‌. వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆయన.. ఇప్పుడు 'స్కైలాబ్‌'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమిది. విశ్వక్‌ ఖండేరావు తెరకెక్కించారు. రాహుల్‌ రామకృష్ణ మరో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 4న రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సత్యదేవ్‌.

hero satyadev
హీరో సత్యదేవ్

*నేను చేస్తున్న తొలి వినోదాత్మక చిత్రమిది. నాకు మొదటి నుంచీ ఇలాంటి సినిమా చేయాలనుండేది. స్వతహాగా నేను చాలా సరదా మనిషినే. కాకపోతే నా ఫేస్‌ కాస్త ఫన్‌కు అతీతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సీరియస్‌ పాత్రలు చేస్తూ వచ్చాను. దీనికి తోడు సరైన కథ కూడా దొరక్కపోవడం వల్ల ఇన్నాళ్లు ఆగాను. ఇన్నాళ్లకు 'స్కైలాబ్‌'తో నా నిరీక్షణ ఫలించింది. ఇందులో ఫన్నీ పంచ్‌లు.. అవీ ఇవీ ఉంటాయని చెప్పను కానీ, నా పాత్రే చాలా ఫన్నీగా ఉంటుంది. నేనిందులో ఆనంద్‌ అనే డాక్టర్‌గా కనిపిస్తా. బండలింగంపల్లిలో క్లినిక్‌ పెట్టాలనేది నా లక్ష్యం. అయితే స్కైలాబ్‌ పడబోతున్నప్పుడు.. దాన్ని వ్యాపారాత్మకంగా వాడుకొని ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించడం మొదలు పెడతాను. మరి నా లక్ష్యం నెరవేరిందా? ఊర్లో క్లినిక్‌ పెట్టానా? లేదా? అన్నది తెరపై చూడాలి. ఇదొక సిచ్చువేషనల్‌ కామెడీ మూవీ.

* సినిమాలో నాకు నిత్యాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఏమీ లేవు. కానీ, ఇద్దరి కథలకు ఓ ఆసక్తికర కనెక్టింగ్‌ పాయింట్‌ ఉంటుంది. రాహుల్‌ రామకృష్ణ పోషించిన సుబేదార్‌ రామారావు పాత్ర.. అలాగే బండలింగంపల్లి ఊరి జనాల పాత్రలు.. ఇలా ప్రతి పాత్రా వినోదం పంచుతుంది. పంచ్‌లు వేసి నవ్వించాలంటే కాస్త కష్టపడాలి కానీ, క్యారెక్టర్‌లోనే హ్యూమర్‌ ఉంటే.. మనం ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో కామెడీ పండించడం పెద్ద కష్టమనిపించలేదు. ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికాను.

skylab movie
స్కైలాబ్ మూవీ

* నేనెప్పుడూ ఛాలెంజింగ్‌ పాత్రల కోసమే ఎదురు చూస్తుంటా. ఎందుకంటే చేసే పాత్రల్లో సవాల్‌ లేకపోతే నటుడిగా సంతృప్తి దొరకదు. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలన్నీ అలాంటివే. 'గుర్తుందా శీతాకాలం' నేను చేస్తున్న తొలి ప్రేమకథా చిత్రం. నేనందులో మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తా. 'గాడ్సే' ఓ థ్రిల్లర్‌ మూవీ. విద్యా వ్యవస్థపై సాగే ఆసక్తికర కథాంశతో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే కొరటాల శివ బ్యానర్‌లో చేస్తున్న చిత్రం, అక్షయ్‌ కుమార్‌తో చేస్తున్న 'రామ్‌ సేతు'.. ఇవన్నీ విభిన్న కథాంశాలతో రూపొందుతున్నవే.

* నటుడిగా నేను సంతృప్తికర స్థితికి చేరుకోవడానికి ఇంకో 20 - 30ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం కొత్త తరహా పాత్రలు చేయాలనే ఆకలితో ఉన్నా. 'ఆపద్బాంధవుడు'లో చిరంజీవి చేసిన పాత్ర నుంచి 'సూపర్‌ డీలక్స్‌'లో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్ర వరకు నాకు చాలా డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయి. అలాగే 'నాయకుడు'లో కమల్‌ హాసన్‌ నటనని ఎంతో ఇష్టపడతా. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'గాడ్‌ఫాదర్‌'లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాను.

skylab movie
స్కైలాబ్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.