అమాయకపు చూపులతో.. దేవుడికి నమస్కారం చేస్తూ.. నల్లని దుస్తుల్లో ఉన్న ఈ హీరోలను గుర్తుపట్టారా? వాళ్లు మరెవరో కాదు టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, సాయితేజ్. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ చిన్నప్పుడు జరిగిన ఓ వేడుకలో సుస్మిత, రామ్‌చరణ్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను సాయితేజ్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో సాయితేజ్.. చిన్నారి శ్రీజ, రామ్‌చరణ్‌కు మధ్యలో కనిపించాడు.
'చెన్నై నివాసంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. సుస్మిత, రామ్‌చరణ్, శ్రీజాలతో నేను' అని సాయితేజ్ పేర్కొన్నాడు. సాయితేజ్ పోస్ట్ చేసిన ఫొటోపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఆ ఫొటో చాలా క్యూట్‌గా ఉందంటూ వ్యాఖ్యలు పెట్టారు. దీనిని చూసి మెగా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది 'చిత్రలహరి', 'ప్రతిరోజూపండగే' సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయితేజ్. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడు. నభా నటేశ్ హీరోయిన్.
మరోవైపు 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌చరణ్ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇందులో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదలకానుందీ సినిమా.
ఇదీ చూడండి.. కేరళ విద్యార్థినికి 'షారూక్ ఖాన్' స్కాలర్షిప్