'ఆర్ఆర్ఆర్' హీరో రామ్చరణ్(rrr ram charan new look) నుంచి త్వరలో అతిపెద్ద న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్న ఇతడు.. త్వరలో ఓ న్యూస్ ఛానెల్(ram charan news channel) కొనుగోలు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం వీటి గురించి చర్చే జరుగుతున్నప్పటికీ, కొన్నిరోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన చరణ్.. ఆ తర్వాత శంకర్(ram charan shankar movie) దర్శకత్వంలో నటిస్తారు. ఇటీవల ఆ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా, తమన్ సంగీతమందిస్తున్నారు. దిల్రాజు నిర్మాత.
ఇవీ చదవండి: