డార్లింగ్ హీరో ప్రభాస్, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. ఈ మధ్య జార్జియాకు షూటింగ్ కోసం వెళ్లొచ్చిన ఈ కథానాయకుడు.. ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.
'విదేశాల్లో సురక్షితంగా షూటింగ్ పూర్తి చేసి ఇక్కడి వచ్చాం. ఈ తరుణంలో కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా. మీరంతా సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నా' -ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రభాస్
#ప్రభాస్20 పేరుతో తీస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ నుంచి వచ్చిన తర్వాత కథానాయికతో పాటు హాస్యనటుడు ప్రియదర్శి, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇప్పుడు ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.