ETV Bharat / sitara

కరోనా కాదు కదా ఏమొచ్చినా నా పెళ్లి ఆగదు: నిఖిల్​

కరోనా నియంత్రణలో భాగంగా పలు కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నారు. అయితే తన పెళ్లి మాత్రం అనుకున్న తేదీకి జరుగుతుందని అన్నాడు హీరో నిఖిల్.

Hero Nikhil says that the corona virus does not hinder his marriage
గుడిలో అయినా సరే పెళ్లి చేసుకుంటా: హీరో నిఖిల్​
author img

By

Published : Mar 16, 2020, 2:35 PM IST

హీరో నిఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. గత నెల 2న తన ప్రేయసి, డాక్టర్​ పల్లవితో నిశ్చితార్ధాన్ని జరుపుకొన్న ఇతడు.. వచ్చే నెల​ 16న వివాహం చేసుకోనున్నాడు. కరోనా ప్రభావంతో ఇతడి పెళ్లి వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించాడు. కరోనా కావొచ్చు, ఇంకేదైనా కారణం కావొచ్చు.. ఏమైనా సరే తన పెళ్లి అనుకున్న తేదీ ప్రకారం జరుగుతుందని నిఖిల్ అన్నాడు.

" ఏప్రిల్​ 16న ఎట్టి పరిస్థితిలోనూ నా పెళ్లి జరిగి తీరుతుంది. కరోనా కాదు ఏమొచ్చినా ఆగదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైతే, గుడిలోనైనా పెళ్లి చేసుకుంటాం. వాయిదా వేసే ఉద్దేశం లేదు"

- నిఖిల్​, యువ హీరో

నిఖిల్.. ఇప్పటికే తన పెళ్లికి అవసరమైన షాపింగ్​ పూర్తి చేసుకున్నాడు. వివాహానికి హాజరయ్యే అతిథుల జాబితా​ను సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం ఓ వేడుకకు 200 మంది కంటే ఎక్కువ మందిని ఆహ్వానించరాదు.

ఇదీ చూడండి.. అల్లు అయాన్​కు విషెస్ చెప్పిన బాలీవుడ్​ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.