తమిళ దర్శకుడు అట్లీ-షారుక్ ఖాన్ కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రం శంకి (వర్కింగ్ టైటిల్)పేరుతో రూపొందుతోంది. అయితే ఈ చిత్రం షారుక్ ప్రస్తుతం నటిస్తున్న 'పఠాన్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఆగస్టు 21 ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యానిమల్'. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ వెల్లడించారు. ఇందులో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. భూషణ్ కుమార్ నిర్మాణంలోనే రూపొందుతున్న మరో చిత్రం 'లవ్ రంజన్', బ్రహ్మాస్త్ర సినిమాల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: షారుక్- అట్లీ సినిమాకు రెహమాన్ సంగీతం!