ETV Bharat / sitara

వచ్చే ఏడాదిలో అజయ్​ దేవగణ్​ 'మైదాన్'​ - అజయ్​ దేవగణ్​ మైదాన్​ విడుదల తేదీ ఖరారు

అజయ్​దేవగణ్​ 'మైదాన్'​ చిత్రం.. వచ్చే ఏడాది ఆగస్టు 13న థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కథానాయకుడు ట్వీట్ చేశారు.

Azay
అజయ్​ దేవగణ్​
author img

By

Published : Jul 4, 2020, 2:58 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో అజయ్​దేవగణ్​ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా 'మైదాన్'​. దీనిని వచ్చే ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కచ్చితంగా థియేటర్లలోనే తొలుత ప్రదర్శిస్తామని తెలిపింది. తొలుత ఈ నవంబరు 27నే విడుదల చేయాలనుకున్నా.. కరోనా వల్ల సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. దీంతో రిలీజ్​లో మార్పు జరిగింది.

స‌య్య‌ద్​ అబ్ధుల్ ర‌హీం జీవితం ఆధారంగా 'మైదాన్' తీస్తున్నారు. 1952 నుంచి 1963 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భార‌త్. ఆ స‌మ‌యంలో ఆ జ‌ట్టుకు కోచ్‌గా ఈయన వ్యవహరించారు.

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, జీ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. అజయ్‌ దేవగణ్‌తో పాటు ప్రియమణి, గజ్​రాజ్​ నటిస్తున్నారు. అమిత్‌ రవీందర్‌నాథ్‌ దర్శకుడు.

గల్వాన్​ ఘటనపైనా అజయ్ సినిమా

జూన్​ 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయ వద్ద భారత్​-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. అయితే తాజాగా ఇదే కథతో అజయ్​ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఇది చూడండి : గల్వాన్ ​ఘటనపై అజయ్​ దేవగణ్​ సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.