తమ హీరో సినిమా(tollywood movies 2021) నుంచి కొత్త అప్‌డేట్‌లు ఎప్పుడు వస్తాయా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. టీజర్, ట్రైలర్ విడుదలైతే ఎన్ని క్లోజప్ షాట్‌లు పడ్డాయి? ఎన్ని గెటప్స్‌లో కనిపించాడు? పంచ్ డైలాగ్‌లేంటి? ఇలా లెక్కలేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తారు. కానీ, త్వరలో విడుదల కాబోయే కొన్ని చిత్రాలు ప్రచారం విషయంలో కొత్త పంథా అనుసరిస్తున్నాయి. హీరోల పంచ్ డైలాగ్‌లతో పని లేకుండా 'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' అన్నట్టు కేవలం విజువల్స్‌తో టీజర్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాలు(tollywood movies 2021) విడుదలవుతుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఇక వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో మిలియన్లు దాటేస్తున్నాయి. కేవలం విజువల్స్‌తోనే మెస్మరైజ్ చేస్తున్న ఆ సినిమాలు వీడియోలు ఏంటో చూసేద్దామా?
ఆ ఒక్క వీడియోతో రాఖీభాయ్ రికార్డులు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్-1'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'కేజీఎఫ్: చాప్టర్-2'(kgf 2 teaser) రాబోతోంది. ఈ ఏడాది జనవరిలో యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్(kgf 2 teaser) ఇప్పటివరకూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 200మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించింది. ఇందులో హీరోతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేదు. 2 నిమిషాల 16 సెకన్ల పాటు సాగే ఈ వీడియోను కేవలం బ్యాగ్రౌండ్ వాయిస్‌తోనే అభిమానుల మనసు దోచేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'పుష్పరాజ్' తగ్గేదేలే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'(pushpa glimpse). రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ వీడియో(pushpa glimpse)ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులోనూ హీరోతో భారీ పంచ్ డైలాగ్‌లు ఏమీ చెప్పించలేదు కేవలం 'తగ్గేదేలే' అనే మాట తప్ప మరో డైలాగ్ లేదు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
'ఆర్‌ఆర్‌ఆర్' ఆ రెండు వీడియోలు అదుర్స్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'(rrr glimpse records). రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. చారిత్రక కథకు ఫిక్షన్ జోడించి జక్కన్న పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పుట్టిన రోజు సందర్భంగా ఒకరికి మరొకరి వాయిస్‌తో పరిచయ వీడియోలను విడుదల చేసింది చిత్రబృందం. కానీ, దీపావళి కానుకగా సోమవారం విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్'(rrr glimpse records)లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం విజువల్స్‌తో కట్టిపడేసింది. ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఎక్కడ కన్ను మూస్తే ఏది మిస్ అయిపోతామోనని 46 సెకన్ల పాటు నెటిజన్లు కళ్లప్పగించి చూశారంటే అతిశయోక్తి కాదు.