తారక్ నెవర్ బిఫోర్ అవతార్.. ఫొటో అదుర్స్ - జూనియర్ ఎన్టీఆర్ తాజా వార్తలు
బుధవారం (మే20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చాడు ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. అలాగే బిగ్‌బాస్-1 బృందం కూడా కూడా తారక్ కోసం ఓ స్పెషల్ వీడియోను పంచుకోనుంది.
కథానాయకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న 'ఆర్'ఆర్'ఆర్' చిత్రబృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్ కారణంగా సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయడానికి వీలులేకపోవడం వల్ల టీజర్ రూపొందించడం కష్టంగా మారింది. దీనిపై తారక్ వివరణ కూడా ఇచ్చారు. యూనిట్ సభ్యులు చాలా కష్టపడ్డారని, కుదరలేదని చెప్పారు.
పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అందరూ భౌతికదూరం పాటించాలని కోరారు ఎన్టీఆర్. దీంతో నిరాశ చెందిన అభిమానుల్లో.. తారక్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కాస్త ఉత్సాహం నింపారు. బుధవారం తారక్ పుట్టినరోజు సందర్భంగా.. నెట్టింట ఓ ఫొటో షేర్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలో తారక్ ఎప్పుడూ చూడని అవతారంలో కనిపించారు. ఈ ఫొటో చూసిన అభిమానులు 'అరాచకం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
'బిగ్‌బాస్' సీజన్-1కు వ్యాఖ్యాతగా వ్యవహరించి తారక్ బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందాడు. బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా 'బిగ్‌బాస్' సీజన్-1 హౌస్‌మేట్స్ అంతా కలిసి ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. దీన్ని రేపు ఉదయం 9.30 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేయబోతున్నారు.
యువ కథానాయకుడు విశ్వక్‌సేన్ కూడా తారక్‌కు అంకితం ఇస్తూ ఓ పాటను విడుదల చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు దీన్ని షేర్ చేయబోతున్నారు.