ETV Bharat / sitara

'బుల్లితెర నటుల్ని అసమర్థులుగా చూస్తున్నారు' - latest nepotism news updates

బాలీవుడ్​లో టీవీ నటులకు సరైన అవకాశాలు లభించడం లేదని ప్రముఖ బుల్లితెర నటి హెల్లీ షా తెలిపింది. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Helly Shah: TV actors don't get fair chance in Bollywood
హెల్లీ షా
author img

By

Published : Jul 25, 2020, 3:33 PM IST

బుల్లితెర నటీనటులు హీందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం అంత సులువు కాదని ప్రముఖ టెలివిజన్​ నటి హెల్లీ షా తెలిపింది. తమను అసమర్థులుగా భావిస్తున్నారని పేర్కొంది. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మరణంతో బంధుప్రీతిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే టెలివిజన్ నటులకు ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలపై హెల్లీ స్పందించింది.

"టీవీ స్టార్​ హీనా ఇటీవల చెప్పిన విషయంతో నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. టీవీ నటీనటులకు బాలీవుడ్​లో సరైన అవకాశాలు లభించవు. నేనూ ఈ సమస్య ఎదుర్కొన్నా. రెండుసార్లు ఆడిషన్స్​కు వెళ్లా. ఆ సమయంలో ఇతర వ్యక్తులను చూసిన విధంగా మమ్మల్ని చూడరని నేను గమనించా. మాకు అనుకున్నంత స్థాయిలో ప్రతిభ లేదని వారు భావిస్తారు. ఒక్క అవకాశం ఇస్తే మేమేంటో నిరూపించుకుంటాం. మేము కూడా నటులమే. మాలోనూ టాలెంట్​ ఉంది. కానీ అవకాశం ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం."

-హెల్లీ షా, బుల్లితెర నటి

ప్రస్తుతం 'ఇష్క్ మైన్​ మార్జావన్'​ రెండో సీజన్​ షూటింగ్​లో ఉన్న హెల్లీ.. టెలివిజన్​ నటులను భిన్నంగా చూస్తారని తెలిపింది. కచ్చితంగా ఇండస్ట్రీలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతుందని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.