అగ్ర కథానాయకులు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ 'మిషన్ మంగళ్'లో భాగస్వామ్యం కావడం ఓ రకంగా లాభమేనని వెల్లడించాడు దర్శకుడు జగన్ శక్తి. ప్రేక్షకులు అభిమానించే వారితో సినిమా తీస్తే ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పుకొచ్చాడు.
" నేను ఈ సినిమా కథను ఎంచుకున్నప్పుడు పెద్ద నటీనటులతో తెరకెక్కించాలని అనుకోలేదు. కానీ కథను మామూలుగా చెప్పగానే అందరూ నటించేందుకు ఒప్పుకున్నారు. ఇంతమంది స్టార్లు ఉండటం సినిమాకు కలిసివచ్చే అంశం. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులతో తీసిన చిత్రం ఎక్కువ మందికి చేరుతుంది. అయితే కథలో దమ్ముంటే చిన్న నటులతో తీసినా మంచి ఆదరణ లభిస్తుంది".
-- జగన్ శక్తి, బాలీవుడ్ దర్శకుడు
ఇస్రో మార్స్ ఆర్బిటర్‌ను విజయవంతంగా ప్రయోగించిన కథాంశంతో రానుందీ మిషన్ మంగళ్. ప్రముఖ శాస్త్రవేత్త సతీష్ ధావన్ పాత్రను అక్షయ్ పోషించాడు. విద్యాబాలన్, తాప్సీ, కీర్తి కుల్హరీ, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్ మహిళా శాస్త్రవేత్తలుగా కనిపించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమా ఫస్ట్‌లుక్‌లో అక్షయ్ కుమార్ ఫోటో హీరోయిన్ల కన్నా పెద్దదిగా ఉండటం విమర్శలకు దారితీసింది. దానిపైనా సమాధానమిచ్చాడు దర్శకుడు. దాదాపు 8 మంది మహిళా స్టార్లు ఈ పోస్టర్లో కనిపిస్తారని... వారిలో అక్షయ్‌ను కాస్త భిన్నంగా చూపించేందుకు హైలైట్ చేసినట్లు చెప్పాడు. కాని సినిమాలో అందరి పాత్రలు చాలా బలమైనవని అంటున్నాడు దర్శకుడు.
మిషన్ మంగళ్ కథను 'ప్యాడ్‌మ్యాన్', 'హాలీడే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్షయ్ కు వివరించినట్లు చెప్పాడు జగన్. 'పా'తెరకెక్కిస్తున్నప్పుడు విద్యా బాలన్‌కు, 'అకిరా' చిత్రీకరణ సమయంలో సోనాక్షితో ఈ సినిమా కోసం చర్చించినట్లు వెల్లడించాడు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కథను అంగీకరిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది సంగతి: 'భారతీయుల విజయాలు ప్రపంచానికి తెలియాలి'