ETV Bharat / sitara

కాజల్​ ప్లేస్​లో హీరోయిన్​గా ఇలియానాకు ఛాన్స్! - నాగార్జున తాజా చిత్రం

నాగార్జున 'ది ఘోస్ట్​'(Nagarjuna Ghost Movie) చిత్రంలో హీరోయిన్ మారిందా? కాజల్ అగర్వాల్ బదులుగా హీరోయిన్​గా ఇలియానాను ఎంపిక చేశారా? దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

nagarjuna's movie
నాగార్జున సినిమా
author img

By

Published : Sep 20, 2021, 1:29 PM IST

వ్యక్తిగత కారణాలతో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్​' చిత్రం(Nagarjuna Ghost Movie) నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకొందట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్​గా ఇలియానాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

kajal aggarwal
కాజల్​ అగర్వాల్

చివరిసారిగా..

'పోకిరి'తో స్టార్​గా మారిన ఇలియానా.. టాలీవుడ్ అగ్రహీరోలు మహేశ్​, పవన్​కల్యాణ్, ప్రభాస్​​లతో పలు బ్లాక్​బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా.. 2018లో విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో మెరిసింది. ఇప్పుడు నాగ్ సినిమాలో అవకాశం వచ్చిందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కొన్నేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న భారీ చిత్రం ఇదే అవుతుంది

ileana
ఇలియానా
ileana
ఇలియానా
the ghost
ది ఘోస్ట్ చిత్రం

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్​ సత్తారు​ దర్శకత్వంలో 'ది ఘోస్ట్​'​(Nagarjuna Ghost Movie) చిత్రం.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పూర్తిస్థాయి యాక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్​టైన్​మెంట్స్​​, వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న 'బంగార్రాజు'(Bangarraju) షూటింగ్​ ఇటీవలే ప్రారంభమైంది.

ఇదీ చదవండి: This Week Movie Releases: ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.