ETV Bharat / sitara

పవన్​ చిత్రంపై హరీశ్ ట్వీట్- ఫ్యాన్స్​లో జోష్​

author img

By

Published : Jun 27, 2021, 7:35 PM IST

పవన్ కల్యాణ్(Pawan Kalyan)​ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లాల్సి ఉన్నా.. కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలో పవన్​కు సంబంధించిన ఓ వీడియోను​ పోస్ట్​ చేసి అభిమానుల్లో జోష్​ నింపారు హరీశ్​. దీంతో ఫ్యాన్స్​లో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

pawan harish
పవన్​ హరీశ్​

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినా షూటింగ్​ మాత్రం ప్రారంభంకాలేదు. ఈ నేపథ్యంలో హరీశ్​.. ఓ ట్వీట్ చేసి పవన్​ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

పవన్​కళ్యాణ్​కు ఓ డిఫరెంట్​ యాటిట్యూడ్, స్టైల్​, ఎనర్జీ​ ఉంది. అదే ఆయనకు భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను తెచ్చిపెట్టింది. అయితే అదే ఎనర్జీని మళ్లీ రిపీట్​ చేస్తానని మాటిచ్చాడు హరీశ్​. 'బద్రి' సినిమాలోని ఓ సన్నివేశాన్ని పోస్ట్​ చేశాడు. ఇది వైరల్​గా మారగా.. ఇది చూసిన అభిమానుల్లో ​జోష్​ పెరిగింది. సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 'గబ్బర్​సింగ్'​కు మించిన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారు పోస్టులు పెడుతున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్​ సంస్థ నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితమే 'తిరిగి పని ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ పవన్​ కల్యాణ్​ 'గబ్బర్​సింగ్'​ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు హరీశ్​.​ ఆ ట్వీట్​ ద్వారా త్వరలోనే సినిమా షూటింగ్​ ప్రారంభంకానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోషియుమ్​' రీమేక్ చిత్రాలు ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది.

ఇదీ చూడండి: Pawankalyan: పవర్​స్టార్​ వింటేజ్ పిక్స్.. ఫ్యాన్స్​కు పండగే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.