'గబ్బర్‌సింగ్', 'గద్దలకొండ గణేష్' వంటి కమర్షియల్ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించిన ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. ప్రస్తుతం ఆయన ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. భారీ దొంగతనం నేపథ్యంలో సాగే కథతో ఆయన ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 కోసం హరీశ్ శంకర్ ఓ కథ సిద్ధం చేశారు.
![harish shankar atm web series](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14294827_atm-web-series.jpg)
'ఏటీఎం' పేరుతో హైదరాబాద్ నేపథ్యంగా తీసిన ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.చంద్రమోహన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం 'ఏటీఎం' టైటిల్ పోస్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, హరీశ్ శంకర్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: