'భాగమతి' హిట్ తర్వాత అగ్ర కథానాయిక అనుష్కశెట్టి నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో జనవరి 31న విడుదలకానుంది. నేడు అనుష్క లుక్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసి... నూతన సంతవ్సర శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇందులో స్వీటీ గులాబి పట్టుకుని క్యూట్‌గా ఉంది.
![anushka shetty Nishabdham news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5560680_sweety.jpg)
సినిమాలో కళా ప్రేమికురాలి(ఆర్ట్ లవర్)గా కనిపించనుంది అనుష్క. ఇతర పాత్రల్లో మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లిరికల్ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
![anushka shetty Nishabdham news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5560680_movies.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పేసింది అనుష్క. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత గోవింద్ నిహ్లాని రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.