ETV Bharat / sitara

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబెపై వెబ్​సిరీస్​

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబె వెబ్​సిరీస్​ త్వరలో స్మార్ట్​తెరపై కనిపించనుంది. బాలీవుడ్​ దర్శకుడు హన్సల్​ మెహతా ఈ చిత్రాన్ని​ రూపొందించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కోసం అనుమతులు పొందినట్లు సమాచారం.

gangster Vikas Dubey
వికాస్​ దూబె
author img

By

Published : Aug 11, 2020, 9:09 AM IST

Updated : Aug 11, 2020, 2:37 PM IST

ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు వికాస్​ దూబె. ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన ఈ గ్యాంగ్​స్టర్​ .. తర్వాత అదే పోలీసుల ఎన్​కౌంటర్​లో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు దూబె జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్​​ దర్శకుడు హన్సల్​​ మెహతా ఓ వెబ్​సిరీస్​ను తెరకెక్కించనున్నాడు. నిర్మాత శైలేష్​ ఆర్​.సింగ్​ ఇప్పటికే చిత్రీకరణ కోసం అవసరమైన అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సిరీస్​పై డైరెక్టర్​ హన్సల్​ మాట్లాడుతూ.. "ఇది ప్రస్తుత సమాజం, రాజకీయాలు, చట్టసభ సభ్యులు, నేరాల మధ్య ఉండే సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. వికాస్​ దూబె ఘటనలో ఓ పొలిటికల్​ థ్రిల్లర్​ని చూశాను. ఈ వెబ్​ సిరీస్​ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది." అని చెప్పుకొచ్చారు.

Last Updated : Aug 11, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.