ETV Bharat / sitara

భావోద్వేగభరితంగా 'గుంజన్ సక్సేనా' ట్రైలర్

author img

By

Published : Aug 1, 2020, 1:58 PM IST

Updated : Aug 1, 2020, 2:38 PM IST

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఆకట్టుకుంటోన్న 'గుంజన్ సక్సేనా'
ఆకట్టుకుంటోన్న 'గుంజన్ సక్సేనా'

1999 కార్గిల్​ యుద్ధంలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, యుద్ధ ప్రాంతంలోకి వెళ్లిన మొదటి భారత మహిళా వాయుసేన అధికారిగా చరిత్ర సృష్టించారు గుంజన్​ సక్సేనా. ఆమె జీవితాధారంగా రూపొందిన చిత్రమే 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. అయితే థియేటర్లు ఇప్పుడు తెరచుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారు. నెట్​ఫ్లిక్స్​లో ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, వినీత్ సింగ్, అంగద్ బేడి, మానవ్ విజ్ ఇతర పాత్రల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Last Updated : Aug 1, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.