సందీప్ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'చాంగురే ఐటెమ్ సాంగ్‌రే' అనే ప్రత్యేకగీతానికి సంబంధించి ప్రోమో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని మంగ్లీ, సాయి కార్తీక్, దత్తు ఆలపించారు. సాయి కార్తీక్ స్వరాలు సమకూర్చారు. పూర్తి లిరికల్ వీడియోను ప్రముఖ నాయిక రకుల్ ప్రీత్ సింగ్ జులై 22న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ సరసన నేహా శెట్టి కనిపించనుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హర్ష్ కనుమిల్లి హీరోగా దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సెహరి'. సిమ్రన్ చౌదరి నాయిక. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది చిత్రబృందం. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ట్రాక్, టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.