సినిమాల్లో ఆస్కార్.. శాస్త్ర సాంకేతికతలో నోబెల్... జర్నలిజంలో పులిట్జర్.. మరి సంగీతంలో అత్యున్నతమైనది ఒక అవార్డు ఉంది. అదే గ్రామీ. తాజాగా ఇందుకు సంబంధించిన 63వ గ్రామీ అవార్డుల నామినేషన్లను నవంబర్ 24న ప్రకటించారు నిర్వహకులు. వచ్చే ఏడాది జనవరి 31న ఈ వేడుక నిర్వహించనున్నారు. దీనికి ప్రముఖ యాంకర్ ట్రెవర్ నో వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.
ఈసారి నామినేషన్లలో అమెరికన్ సింగర్ బియాన్సీ దుమ్ములేపింది. 9 విభాగాల్లో ఈ అమ్మడు పోటీపడుతోంది. టేలర్ స్విఫ్ట్, డు లిపా, ర్యాపర్ రాడీ రిచ్ 6 విభాగాల్లో రేసులో ఉన్నారు.
ఇవే విభాగాలు..
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్, బెస్ట్ మ్యూజిక్ వీడియో, బెస్ట్ ర్యాప్ ఆల్బమ్, బెస్ట్ రాక్ ఆల్బమ్, బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లో ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా అమెరికాలోని లాస్ఏంజెల్స్ స్టెంపుల్స్ సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. 1959 నుంచి ఏటా ప్రేక్షకులని అలరించిన ఉత్తమ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, కళాకారులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.