ప్రముఖ టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో సెర్ గ్రెగోర్ పాత్రలో నటించిన హాఫ్తార్ జార్న్‌సన్.. ప్రపంచ రికార్డును సాధించాడు. డెడ్ లిఫ్టింగ్‌లో 501 కిలోల బరువునెత్తి ఈ ఘనతను నమోదు చేశాడు. 2018లో ప్రపంచ దృఢమైన వ్యక్తిగా నిలిచిన ఇతడు.. తన జిమ్‌లో శనివారం ఈ బరువును ఎత్తాడు. ఇంతకు ముందు ఈ రికార్డు.. 2016లో జరిగిన ప్రపంచ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్స్‌లో 500 కిలోలు ఎత్తిన వ్యక్తి పేరిట ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ రికార్డు సొంతం చేసుకున్న తర్వాత, తనకు మాటలు రావట్లేదని చెప్పిన హాఫ్తార్.. అద్భుతమైన ఈ రోజును, జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నాడు. ఇందులో భాగంగా సహాయపడిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, అభిమానులు, స్పాన్సర్స్‌తో పాటు తనను ద్వేషిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపాడు.