ETV Bharat / sitara

మాస్​లుక్​తో లక్ష్య ఫస్ట్​లుక్​.. సీటీమార్​ రిలీజ్​ డేట్​ - డోంట్​ బ్రీత్​ 2 మూవీ అప్డేట్లు

టాలీవుడ్​తో పాటు హాలీవుడ్​, బాలీవుడ్​కు సంబంధించి పలు సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. యువహీరో లక్ష్య మాస్​లుక్​తో ఫస్ట్​లుక్​ విడుదల చేయగా.. గోపీచంద్ నటించిన సీటీమార్​ రిలీజ్​ తేదీని చిత్రబృందం ప్రకటించింది.

cinima updates
సినిమా అప్డేట్లు
author img

By

Published : Aug 24, 2021, 1:06 PM IST

టాలీవుడ్​ కథానాయకుడు గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'సీటీమార్'. ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబర్​ 3న బాక్సాఫీస్​ వద్ద సందడి చేయనుంది ఈ మూవీ.

gopichand seetimar release date announced on sep 03
సీటీమార్​లో గోపీచంద్

ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్​గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్​ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది.

మాస్​లుక్​తో గ్యాంగ్​స్టర్​ గంగరాజు..

చదలవాడ లక్ష్య హీరోగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్​స్టర్ గంగరాజు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్​లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాస్​లుక్​తో దర్శనమిచ్చాడు లక్ష్య. చుట్టూ మల్లయోధులు కూర్చొని ఉండగా మధ్యలో కొబ్బరిబోండం తాగుతూ సీరియస్​గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో వేదిక దత్​.. లక్ష్యతో స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది.

లక్ష్య ఫస్ట్​లుక్

చదలవాడ పద్మావతి శ్రీనివాస్​ రావు ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్​ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సాయికార్తీక్​ సంగీతం సమకూరుస్తున్నారు.

స్పైడర్​ మ్యాన్​ రిలీజ్​ డేట్​..

హాలీవుడ్​ మూవీ 'స్పైడర్​ మ్యాన్​: నో వే హోమ్'​కు సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు. ఇండియాలో డిసెంబర్​ 17న ఈ సినిమాను రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. క్రిస్ట్​మస్​ పండగను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

స్పైడర్​మ్యాన్​లో ఓ సన్నివేశం

స్పైడర్​మ్యాన్

టామ్​ హోలండ్​ టైటిల్​ రోల్​లో నటిస్తున్నాడు. అతడి సరసన జెందాయా స్క్రీన్ పంచుకోనుంది. కెవిన్​ ఫీగె, అమీ పాస్కల్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్​ వాట్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మైకేల్ జియాచినో సంగీతం అందిస్తున్నారు.

'తడప్​' ఎప్పుడంటే?

తడప్​

'ఆర్​ఎక్స్​ 100' బాలీవుడ్​ రీమేక్​గా తెరకెక్కుతోన్న సినిమా 'తడప్'​. ఈ చిత్రంలో సునీల్​ శెట్టి తనయుడు అహన్​ శెట్టి హీరోగా పరిచయమవుతున్నాడు. అతడి సరసన తారా సుతారియా హీరోయిన్​గా నటించనుంది. మిలన్​ లుథ్రియా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. సాజిద్​ నదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్​ 3న బాక్సాఫీస్​ వద్ద సందడి చేయనుంది. ​

డోంట్​ బ్రీత్​ 2 మూవీ వచ్చే నెల..

హాలీవుడ్​ హార్రర్​ మూవీ డోంట్​ బ్రీత్​ 2 సినిమాకు సంబంధించి రిలీజ్​ తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీ సెప్టెంబర్​ 17న ప్రేక్షకులను అలరించనుంది.

డోంట్​ బ్రీత్​ 2

స్టీఫెన్​ లాంగ్​- స్టీఫెనీ అర్సిలా నటీనటులుగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఫిడె అల్వారెజ్​, సామ్​ రైమి, రోబ్​ టాపెర్ట్​ నిర్మిస్తున్నారు. రోడో సాయగ్స్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: Alitho saradaga: డబ్బులు లేక కుటుంబానికి దూరంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.