'రూల్స్ ప్రకారం ఆడితే ఆడివస్తారు, రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు', 'ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు కావాల్సింది మగాడి తోడు కాదు, ధైర్యం అనే తోడు' వంటి పవర్ఫుల్ డైలాగ్‌లతో హీరో గోపిచంద్ అదరగొట్టారు. ఆయన నటించిన 'సీటీమార్' సినిమా(Gopichand Seetimaarr) ట్రైలర్‌ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. ఇందులోనే పవర్ఫుల్ యాక్షన్, భారీ డైలాగ్‌లతో గోపిచంద్ తనలోని మాస్ యాక్టింగ్‌ను మరోసారి బయటపెట్టారు. ఇక తమన్నా బ్యూటీ, రావురమేష్ విలనిజంతో ఆద్యంతం ఈ ప్రచారచిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కబ్డడీ నేపథ్యంలో సాగే ఈ కథలో గోపిచంద్,తమన్నా(Gopichand tamannah movie) కబడ్డీ కోచ్‌ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. వినాయక చవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10న థియేటర్లలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
ఇదీ చూడండి: 'వరుడు కావలెను' టీజర్.. 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్