ETV Bharat / sitara

బాలయ్య సినిమా కోసం వందేళ్లు వెనక్కి! - వందేళ్ల గ్రంథాలయంలో గోపీచంద్​ మలినేని

నందమూరి బాలకృష్ణ-గోపీచంద్​ మలినేని కాంబోలో రానున్న చిత్రాన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. అందుకోసం ఓ లైబ్రరీలో పరిశోధన చేస్తున్నారు దర్శకుడు. ఇప్పుడు ఆ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

Gopichand Malineni, Balakrishna's film
బాలయ్య సినిమా కోసం వందేళ్లు వెనక్కి!
author img

By

Published : Apr 15, 2021, 7:46 AM IST

'క్రాక్​'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్​ మలినేని తదుపరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆ చిత్ర కథ కోసం గోపీచంద్​.. వందేళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రంథాలయంలో పరిశోధన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Gopichand Malineni, Balakrishna's film
గ్రంథాలయంలో దర్శకుడు గోపీచంద్​ మలినేని

ఈ సినిమాను మైత్రి మూవీస్​ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ పాజెక్టును పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నారు. మే 28న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదీ చూడండి: నాగబాబు వాట్సాప్​ డీపీలో హీరో బాలకృష్ణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.