నెటిజన్లను ఆకట్టుకునేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు నూతన పంథా ఎంచుకుంటోంది. తాజాగా అవెంజర్స్‌కు జనాల్లో ఉన్న క్రేజ్‌ను క్రియేటివ్‌గా వాడేసుకుంది.
అవెంజర్స్ ఎండ్‌గేమ్ రిలీజ్ రోజున ఓ సరికొత్త మ్యాజిక్‌ను గూగుల్ యూజర్స్ కోసం తయారు చేసింది. అవెంజర్స్ 'ఇన్ఫినిటీ వార్'లోని క్లైమాక్స్‌లో థానోస్ తన హ్యాండ్ గ్లౌజ్‌తో చిటికె వేయగానే కొన్ని పాత్రలు బూడిదలా మారి మాయమవుతుంటాయి. ఆ దృశ్యాన్ని గూగుల్ సృజనాత్మకంగా ఉపయోగించుకుని ఓ కొత్త ఫీచర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
మాయమవుతాయి...మళ్లీ వస్తాయి
గూగుల్‌లో 'థానోస్' అని టైప్ చేసి సెర్చ్ చేయగానే... థానోస్ చేతికి ధరించే హ్యాండ్ గ్లౌజ్ కుడి చేతివైపు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే.. అది ఒక చిటికె వేసి ఓ మ్యాజిక్ చేస్తుంది. గూగుల్ తెరపై కనిపించే సెర్చ్ రిజల్ట్స్‌లో చాలా వరకు మాయం అవుతాయి. స్రీన్ ఖాళీ అయ్యాక మళ్లీ అదే గ్లౌజ్ మీద క్లిక్ చేస్తే మాయమైనవి మరలా ప్రత్యక్షమవుతాయి. ఇది ప్రస్తుతం నెట్టింట మరో ట్రెండ్‌గా కనిపిస్తోంది.