గొల్లపూడి మారుతీరావు కుమారుడు, యువ దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏటా అందించే 'గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు' 2019కి గాను ఉత్తమ తొలి చిత్ర దర్శకులు ఇద్దరికి వరించింది. హిందీలో తెరకెక్కిన మిలటరీ యాక్షన్ చిత్రం 'ఉరి' సినిమాకు గాను 'ఆదిత్య ధర్'కు, మలయాళంలో తెరకెక్కించిన డ్రామా చిత్రం 'కుంబలంగి నైట్స్'కు గాను మధు సి నారాయణ్ను తొలి ఉత్తమ దర్శకులుగా గుర్తిస్తూ అవార్డులకు ఎంపిక చేశారు. వీరిద్దరికి సంయుక్తంగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు సోమవారం గొల్లపుడి ఫౌండేషన్ సభ్యులు ప్రకటించారు.
![Gollapudi Srinivas National Award 2019](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6430778_as.jpg)
అవార్డుల ఎంపికకు వివిధ భాషల నుంచి 22 నామినేషన్లు రాగా వీరిద్దరికీ సంయుక్తంగా పురస్కారం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏటా ఈనెల 17న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అవార్డును ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆగస్టు 12న ఆయన వర్థంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేస్తారు.
![Gollapudi Srinivas National Award 2019](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6430778_rk.jpg)
ఇదీ చూడండి : 'అర్జున్ రెడ్డి 2'తో బన్నీ సర్‌ప్రైజ్..!