ETV Bharat / sitara

నది ఒడ్డున శవమై తేలిన హాలీవుడ్ నటి - naya rivera missing updates

గత బుధవారం పిరూ నదిలో గల్లంతయిన హాలీవుడ్​ నటి నయా రివెరా.. అదే నది ఒడ్డున శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.

నది ఒడ్డున శవమై తేలిన హాలీవుడ్ నటి
హాలీవుడ్ నటి నయా రివెరా
author img

By

Published : Jul 14, 2020, 1:12 PM IST

కొన్నిరోజుల క్రితం(జులై 8) కాలిఫోర్నియాలోని పిరూ నదిలో విహారానికి వెళ్లిన హాలీవుడ్​ నటి నయా రివెరా(33).. అదే నది ఒడ్డున శవమై తేలింది. ఈ విషయాన్ని వెంచురా కంట్రీ షెరిఫ్(పోలీసులు) సోమవారం వెల్లడించారు. అయితే ఆమె శరీరంపై ఆత్మహత్య, హత్య చేసినట్లు గుర్తులు ఏమి లేవని పేర్కొన్నారు.

గత బుధవారం, ఓ బోట్​ను అద్దెకు తీసుకున్న నయా.. నాలుగేళ్ల కుమారుడితో విహారానికి వెళ్లింది. అయితే ఒకచోట ఆ చిన్నారిని గుర్తించారు కానీ ఆమె మాత్రం కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.

Glee actor Naya Rivera
కుమారుడితో నటి నయా రివెరా(పాత చిత్రం)

వాలెన్షియాలో పుట్టిన నయా రివెరా.. పలు టీవీ యాడ్స్​లో నటించి, నాలుగేళ్ల వయసులో 'ద రాయల్ ఫ్యామిలీ' అనే సిట్​కామ్​తో అరంగేట్రం చేసింది. బెల్-ఎయిర్, ఫ్యామిలీ మ్యాటర్స్, బెవాచ్ లాంటి షోలలోనూ నటించింది. 2009-15 మధ్య కాలంలో శాంటానా లోపెజ్​ పాత్రతో మెప్పించి గుర్తింపు తెచ్చుకుంది. గ్రామీ, గిల్డ్, టీన్ ఛాయిస్​ అవార్డుల్లోని పలు నామినేషన్లకు ఎంపికైంది.

ఇవీ చదవండి: నదిలో విహారానికి వెళ్లి తప్పిపోయిన నటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.