ETV Bharat / sitara

'అల్లరి పిల్ల' జెనీలియా మళ్లీ తెరపైకి...! - genelia reentery

'హా హా హాసిని' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన నటి జెనీలియా.. మరోసారి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. హీరో రితేశ్​ దేశ్​ముఖ్​ను పెళ్లి చేసుకున్న జెన్నీ.. ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడుపుతోంది.

జెనీలియా
author img

By

Published : Aug 9, 2019, 2:59 PM IST

చిలిపి నవ్వుతో.. అమాయక చూపులతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించిన అల్లరి పిల్ల జెనీలియా. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్​ను ఎంజాయ్ చేస్తోంది. తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన ఈ భామ.. మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

మళ్లీ తెరపైకి...

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'రెడీ'​తో రామ్-జెనీలియా సూపర్​ జోడీ అనిపించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జెన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఫొటోలు దిగి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు రామ్. అవి నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

నటనకు విరామం...

తన తొలి సినిమా హీరో రితేశ్ దేశ్​ముఖ్​ను దాదాపు 9 ఏళ్లు ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది జెనీలియా. తర్వాత నటనకు విరామం ఇచ్చేసి.. ప్రస్తుతం ఇద్దరు కొడుకులతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

ఆటల్లో...

జెనీలియా.. జాతీయ స్థాయి క్రీడాకారిణి అనే విషయం చాలా మందికి తెలియదు. పాఠశాల​లో ఉన్నప్పుడే ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. బాస్కెట్ బాల్​, హాకీలో రాష్ట్ర స్థాయిలో, ఫుట్​బాల్​లో జాతీయ స్థాయిలో ఆడింది.

ఆరోగ్య రహస్యం...

ఆరోగ్యం​గా ఉండటానికి, కేలరీలు కరిగించేందుకు జిమ్​ కంటే మైదానమే అత్యుత్తమైనదని చెప్పింది​ జెన్నీ. ఏం తినాలి అనేది పెద్దగా ఆలోచించనని, ట్రెడ్​మిల్​, యోగా మాత్రమే ఫాలో అవుతానని వెల్లడించింది.

ఇదీ చూడండి: సంక్రాంతికి 'సైనికాధికారి'గా మహేశ్ బాబు​.!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.