తాను నటించిన సినిమా విడుదల ప్రకటన కార్యక్రమానికి తనను పిలకవపోవడంపై నటుడు విద్యుత్ జమ్వాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏడు బాలీవుడ్ సినిమాల్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఇందుకోసం సోషల్‌మీడియా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏడు సినిమాలకు గానూ ఐదు సినిమాల చిత్రబృందాలే పాల్గొన్నాయి. మిగతా రెండు చిత్రాల చిత్రబృందాలకు ఆహ్వానం అందలేదు. వాటిలో విద్యుత్ నటించిన 'ఖుదా హఫీజ్'కూడా ఉంది. దీంతో నిర్వాహకులపై విద్యుత్ అసహనం వ్యక్తం చేశారు.
విడుదల ప్రకటన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ "ఇది పెద్ద ప్రకటన. ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ కార్యక్రమానికి ఐదు సినిమాలే ప్రాతినిధ్యం వహించాయి. మిగతా రెండు సినిమాలకు ఆహ్వానం అందలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది చాలా దూరం వెళ్తుంది. 'ది సైకిల్ కంటిన్యూస్'అని ట్వీట్ చేశారు.
-
Every film is made with a lot of love, a lot of sweat & a lot people giving it their all. Its only fair to want a little respect, its only fair to expect an invitation, its only fair to have at least been intimated.But then, sometimes even life is not fair. keep walking my friend https://t.co/xBZVf1cYHt
— Genelia Deshmukh (@geneliad) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Every film is made with a lot of love, a lot of sweat & a lot people giving it their all. Its only fair to want a little respect, its only fair to expect an invitation, its only fair to have at least been intimated.But then, sometimes even life is not fair. keep walking my friend https://t.co/xBZVf1cYHt
— Genelia Deshmukh (@geneliad) June 29, 2020Every film is made with a lot of love, a lot of sweat & a lot people giving it their all. Its only fair to want a little respect, its only fair to expect an invitation, its only fair to have at least been intimated.But then, sometimes even life is not fair. keep walking my friend https://t.co/xBZVf1cYHt
— Genelia Deshmukh (@geneliad) June 29, 2020
విద్యుత్ ట్వీట్‌పై నటి జెనీలియా స్పందిస్తూ.. కొన్ని సార్లు జీవితం అంతే అంటూ అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. "ప్రతి సినిమాను ఎంతో ప్రేమతో.. చమటోడ్చి చిత్రీకరిస్తారు. ఎంతో మంది అందులో ప్రాణం పెడతారు. అలాంటి వారు కాస్త గౌరవం కోరుకుంటారు. వారిని ఆహ్వానించాల్సింది. కనీసం సమాచారం అయినా ఇచ్చి ఉండాలి. కానీ, కొన్నిసార్లు జీవితమే మంచిగా ఉండదు. అయినా ముందుకు సాగాలి మిత్రమా.. నీకు మరింత శక్తి కలగాలి"అని విద్యుత్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది.
'ఖుదా హఫీజ్' చిత్రానికి ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించారు. రోమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ సరసన శివలీక ఒబెరాయ్ నటించింది. కరోనా వల్ల థియేటర్లు మూతపడడంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
ఇది చూడండి : ఆమిర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం