తెలుగులో హీరోయిన్గా మెప్పించిన జెనీలియా.. తాను కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. మూడు వారాల క్రితం తనకు వైరస్ సోకిందని, అప్పటినుంచి ఒక్కదాన్నే స్వీయనిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది.
"మూడువారాలు క్రితం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి ఒంటరిగా ఐసోలేషన్‌లో ఉన్నాను. దేవుడిదయ వల్ల నేను తిరిగి కోలుకున్నాను. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు తనకు ఆ సమయం సవాలు విసిరింది. నా కుటుంబాన్ని మళ్లీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది" -జెనీలియా దేశ్‌ముఖ్, నటి
బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ జెనీలియా భర్త. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">