ETV Bharat / sitara

ఆ నటుడితో నాగ చైతన్య హీరోయిన్​ సహజీవనం..! - ప్రేమలో మంజిమా మోహన్‌

Manjima Mohan: 'సాహసం శ్వాసగా సాగిపో'తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది మంజిమా మోహన్‌. ప్రస్తుతం ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓ యువ హీరోతో సహజీవనంలో ఉన్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Gautham Karthik and Manjima Mohan
మంజిమా మోహన్‌, గౌతమ్‌ కార్తిక్‌
author img

By

Published : Feb 15, 2022, 7:18 AM IST

Manjima Mohan: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'కడలి'తో వెండితెరకు పరిచయమైన నటుడు గౌతమ్‌ కార్తిక్‌. కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు కార్తిక్‌ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్‌.. మొదటి సినిమాతోనే ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కెరీర్‌లో సూపర్‌హిట్‌ అందుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్‌ కార్తిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్ట్టింట్లో వైరల్‌గా మారింది. గౌతమ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట. అది కూడా ఓ యువ నటిని ఆయన పెళ్లాడనున్నారట. ఇంతకీ ఆ నటి ఎవరంటే మంజిమా మోహన్‌.

బాలనటిగా కెరీర్‌ ఆరంభించి 'సాహసం శ్వాసగా సాగిపో'తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్‌.. 2019లో గౌతమ్‌ హీరోగా తెరకెక్కిన 'దేవరాట్టం' చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమకు దారి తీయడంతో వీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ పెద్దలకు తెలియడంతో వాళ్లు కూడా పెళ్లికి అంగీకారం తెలిపారట. దీంతో ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగే అవకాశం ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్‌ వినిపిస్తోంది.

ఇదీ చూడండి: సెకండ్​ ఇన్నింగ్స్​లో మీరా జాస్మిన్​ గ్లామర్​ షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.