ETV Bharat / sitara

పాన్​ఇండియాను మించేలా రామ్​చరణ్​-గౌతమ్ ​తిన్ననూరి సినిమా - ramcharan

Gowtam Tinnanuri Ram Charan: రామ్​చరణ్​తో తాను తెరకక్కించబోయే సినిమా యాక్షన్‌ కథాంశంతో ఉంటుందని తెలిపారు దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి. పాన్‌ ఇండియా సినిమాకు మించిన స్థాయిలో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు చెప్పారు.

రామ్​చరణ్​-గౌతమ్​తిన్ననూరి సినిమా, Gowtham tinnanuri-Ramcharan movie story
రామ్​చరణ్​-గౌతమ్​తిన్ననూరి సినిమా
author img

By

Published : Dec 16, 2021, 7:24 AM IST

Updated : Dec 16, 2021, 7:47 AM IST

Gowtam Tinnanuri Ram Charan: 'మళ్లీ రావా', 'జెర్సీ' చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ప్రస్తుతం హిందీ 'జెర్సీ'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయనున్నారు. ఇది స్పోర్ట్స్‌ డ్రామా కథాంశంతో రూపొందనుందని, సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతుందని రకరకాల వార్తలు వినిపించాయి.

అయితే ఈ చిత్ర కథాంశంపై గౌతమ్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. చరణ్​తో చేయనున్న సినిమా యాక్షన్‌ కథాంశంతో ఉంటుందని తెలియజేశారు. అది పాన్‌ ఇండియా చిత్రమని.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అంతకు మించిన స్థాయిలోనే ఉంటుందని చెప్పారు. అలాగే ఇందులో చిరంజీవి నటించనున్నారనే పుకార్లకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెక్‌ పెట్టారు గౌతమ్‌ తిన్ననూరి. ఈ సినిమాలో ఆయనకు సరిపడే పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చరణ్‌ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతుండగా.. శంకర్‌తో చేస్తున్న కొత్త సినిమా సెట్స్‌పై ముస్తాబవుతోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గౌతమ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పుష్ప' కోసం మూడేళ్లు అడవుల్లోనే!

Last Updated : Dec 16, 2021, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.