ETV Bharat / sitara

'లాక్​డౌన్​లో షారుఖ్​​ వంటను ఎంజాయ్​ చేశా' - గౌరీ ఖాన్​ వార్తలు

లాక్​డౌన్​లో బాలీవుడ్​ స్టార్​ షారుఖ్​​ఖాన్..​ కుటుంబసభ్యులకు తానే స్వయంగా వండి పెట్టారని అతని భార్య గౌరీ ఖాన్​ వెల్లడించారు. వంట చేయడాన్ని షారుఖ్​ చాలా ఆస్వాదించారని.. అతని వంట తిని తాము ఎంజాయ్​ చేసినట్లు ఆమె వెల్లడించారు.

Gauri Khan reveals thar Shahrukh khan used to cook for the family during Lockdown
'లాక్​డౌన్​లో షారుఖ్​​ వంటను ఎంజాయ్​ చేశా'
author img

By

Published : Sep 29, 2020, 7:02 AM IST

నిత్యం, సినిమాలు, షూటింగులు, ప్రచార కార్యక్రమాలు, ఫొటోషూట్​లు.. ఇలా సినీ తారల జీవితం బిజీ బిజీ. కుటుంబంతో గడపడానికి సమయం తక్కువే. ఎంతో ప్లాన్​ చేసుకుంటే కానీ కుదరదు. కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్​డౌన్​ సమయం చాలామంది సినీ తారలకు కుటుంబంతో హాయిగా గడిపే అవకాశం ఇచ్చింది. బాలీవుడ్​ స్టార్​ షారుఖ్​ఖాన్​కూ ఆ అవకాశం చిక్కింది. కుటుంబంతో ఆనందంగా ఎంజాయ్​ చేయడమే కాదు గరిట పట్టి కుటుంబసభ్యుల కోసం వంట కూడా చేశారట. ఈ విషయం గురించి ఆయన భార్య గౌరీఖాన్​ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"అందరం ఇంట్లోనే ఉన్నాం. అందరికీ వండాలంటే చాలా కష్టమే. నలుగురు కలిసి ఉన్నప్పుడే కదా సంతోషంగా తినేది. అలాగని బయట నుంచి ఆహారం తెప్పించుకోవడం అంత మంచిది కాదు. అప్పుడు మా వారు స్వయంగా రంగంలోకి దిగారు. మాకు నచ్చిన వంటలను వండిపెట్టారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆయన వంట చేయడాన్ని ఎంజాయ్​ చేస్తే.. నేను ఆయన వండిన దాన్ని తిని ఎంజాయ్​ చేశా" అని చెప్పారు గౌరీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.