ETV Bharat / sitara

సినిమాను తలపించేలా పూర్ణ కిడ్నాప్​ ప్లాన్​ - నటి పూర్ణ కిడ్నాప్​ ప్లాన్​

హీరోయిన్ పూర్ణను వేధించిన ఎనిమిది మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వీరు సినీఫక్కీలో పూర్ణను కిడ్నాప్​ చేయడానికి భారీ ప్రణాళికను రచించినట్లు వెల్లడించారు పోలీసులు .

poorna
పూర్ణ
author img

By

Published : Jul 1, 2020, 7:55 PM IST

ప్రముఖ నటి పూర్ణను బ్లాక్​ మెయిల్​ చేస్తున్నట్లు నమోదైన కేసులో.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కేరళ పోలీసులు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని కొచ్చి నగర పోలీస్​ కమిషనర్​​ విజయ్​ సఖ్రే స్పష్టం చేశారు. నిందితులు ఆమెను సినీఫక్కీలో కిడ్నాప్​ చేసేందుకు భారీ ప్రణాళిక రచించినట్లు వివరించారు సఖ్రే.

"మొదట పూర్ణ వివాహ ప్రతిపాదన ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరచుకుని, అనంతరం కిడ్నాప్ చేయాలని ముఠా ప్లాన్ వేసింది. ఓ హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున ఆమె దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలనుకున్నారు. అయితే ఈ ప్రణాళిక విఫలమైంది. నటీనటుల వివరాలను సేకరించి.. సినిమా ఆఫర్ల పేరుతో వారిని వలలో వేస్తారు. అనంతరం వారిని బెదిరించి డబ్బులను డిమాండ్ చేయడం వీరికి మామూలే. ఈ ఏడాది మార్చిలోనూ పాలక్కాడ్​లో ఎనిమిది మంది మోడల్స్​ను బంధించి, వారి దగ్గర నుంచి ఈ ముఠా డబ్బులు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూర్ణ, ఇతర మహిళల ఫిర్యాదుల ఆధారంగా వీరిపై ఏడు కేసులు నమోదు చేశాం."

-విజయ్​ సఖ్రెే, నగర పోలీస్ కమిషనర్​​.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్య నటుడు ధర్మజన్ బోల్గట్టిని కూడా విచారించినట్లు వెల్లడించారు సఖ్రెే. ఇందులో ఇతర సినీ వ్యక్తుల హస్తం లేదని స్పష్టం చేశారు.

poorna
నటి పూర్ణ

ఇది చూడండి : కూతురు కావాలంటే హత్యలు చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.