ఇండస్ట్రీ ఏదైనా సెలబ్రిటీ ప్రేమ జంటలు ఉండటం ఖాయం. ముఖ్యంగా బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ లవ్ బర్డ్స్‌లో ఏ జంట పెళ్లి పీటలెక్కుతుందో? ఏ జంట విడిపోయి మరో తోడు వెతుక్కుంటుందో చెప్పలేం. వీరిలో కొంతమంది పెళ్లిల్లు చేసుకుని హాయిగా జీవితం గడుపుతుండగా? మరికొందరు ఇంకా ప్రణయ బంధంలోనే ఉన్నామంటూ స్వేచ్ఛనిచ్చిన పావురాల్లా హాయిగా చట్టాపట్టాలేసుకుని నచ్చిన చోటల్లా వాలిపోతుంటారు. ఇందులో కొన్ని ప్రేమజంటలు తమ డేటింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టి 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యే అవకాశముందని సమాచారం. వారెవరో తెలుసుకుందాం.
వరుణ్-నటాషా
బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది హీరో వరుణ్ ధావన్ పెళ్లి. ఇతడు తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వివాహం చేసుకోనున్నాడు. కొన్నేళ్ల నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించాడీ హీరో.
రిచా చద్ధా-అలీ ఫజల్
బాలీవుడ్లో సీనియర్ ప్రేమ జంట రిచా చద్ధా-అలీ ఫజల్. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతునట్లు ప్రకటించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ వివాహ వేడుక వాయిదా పడింది. బహుశా వీరు వచ్చే ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే అవకాశముంది. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున 'షకీల' బయోపిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది రిచా.
ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్
లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి టాపిక్ పలుసార్లు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది డిసెంబరులో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వీరి పెళ్లి జరుగుతుందని వారి కుటుంబాలకు సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపాడు. కానీ ఇంకా కరోనా ఉద్ధృతి ఉండటం వల్ల వేడుక ప్రణాళిక మారిందని తెలిసింది. మరి వీరు వచ్చే ఏడాదైన ఒక్కటవుతారో లేదో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తొలిసారి జంటగా 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు.
అర్జున్-మలైకా
హీరో అర్జున్ కపూర్-నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వేడుకల్లో జంటగా కనిపించి కెమెరా కంటికి చిక్కారు. కానీ వారి ప్రేమాయణంపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. నిత్యం సోషల్‌మీడియాలో తాము సన్నిహితంగా ఉండే ఫొటోలను పోస్ట్ చేస్తూ తమ బంధం గురించి పరోక్షంగా తెలియజేస్తుంటారు. ఇటీవల దీనిపై స్పందించిన అర్జున్.. ప్రస్తుతానికి తాము పెళ్లి చేసుకునే యోచనలో లేనట్లు తెలిపాడు. కానీ ఎప్పుడైనా జరగాల్సిందేగా అని అన్నాడు. ప్రస్తుతం అర్జున్.. 'భూత్ పోలీస్', 'సర్దార్ అండ్ గ్రాండ్ సన్' సినిమాల్లో నటిస్తున్నాడు.
మలైకా 1998లో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు.. అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2017లో విడాకులు తీసుకుంది. వీరు విడిపోవడానికి అర్జున్ కారణమని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోడల్ జార్జియా ఆండ్రియానితో అర్బాజ్ డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అర్జున్ కపూర్ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దది కావడం గమనార్హం.
ఫర్హాన్ అక్తర్- షిబాని
ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్- షిబాని దండేకర్ దాదాపు రెండేళ్ల నుంచి డేటింగ్లో ఉన్నారు. కొద్దికాలం క్రితమే వీరి గుట్టు బయటపడింది. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి ఈ వేడుక వాయిదా పడిందని తెలిసింది. అయితే ఫర్హాన్‌కు ఇప్పటికే పెళ్లై తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం అతడు.. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ యాత్రికుడు రాకేశ్ శర్మ బయోపిక్‌లో నటిస్తున్నాడు. కాగా, షిబానీ ఐపీఎల్ హాట్ యాంకర్‌గా అందరికీ సుపరిచితురాలు. హీరోయిన్స్ కన్నా ఎక్కువ వన్నెచిన్నెలు ఒలకబోస్తూ అటు మోడలింగ్‌లోనూ, ఇటు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటుందీ అమ్మడు.
ఇదీ చూడండి : ఈ ముద్దుగుమ్మలకు ఆ హీరోలంటే ఎంతిష్టమో!