ETV Bharat / sitara

అమెరికన్ ఫొటోగ్రాఫర్​తో 'స్లమ్​డాగ్'​ బ్యూటీ పెళ్లి - తెలుగు లేటెస్ట్​ సినిమాలు

'స్లమ్​డాగ్​ మిలీనియర్' హీరోయిన్​ ఫ్రిదా పింటో.. అమెరికన్​ ఫొటోగ్రాఫర్​ కోరీ ట్రాన్​ను పెళ్లి చేసుకోబోతుంది. రెండేళ్లుగా ​ ప్రేమలో ఉన్న ఫ్రిదా.. అతడి పుట్టినరోజున ఈ విధంగా సర్​ప్రైజ్ చేసింది.

అమెరికన్ ఫొటోగ్రాఫర్​ను పెళ్లాడనున్న స్లమ్​డాగ్​ బ్యూటీ
author img

By

Published : Nov 22, 2019, 1:48 PM IST

హాలీవుడ్​ హీరోయిన్​ ఫ్రిదా పింటో.. తన ప్రియుడు, అమెరికన్​ ఫొటోగ్రాఫర్​ కారీ ట్రాన్​ పుట్టిన రోజున మరిచిపోలేని బహుమతిచ్చింది. అతడితో నిశ్చితార్థం చేసుకొని ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చెసిందీ ముద్దుగుమ్మ. తన జీవితంలో ట్రాన్​ ఎంత ముఖ్యమో వివరిస్తూ ఓ వ్యాఖ్య జోడించింది.

"నా జీవితానికి అర్థం ఇదే. గతంలో కన్నీళ్లకు, పరీక్షలకు ఫలితం ఇదే. ప్రేమ గురించి పాత ప్రేమికులు చెప్పిన దానికి సారమిదే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో, ఎక్కడికెళ్లాలని అనుకుంటున్నానో ప్రతి దానికి గమ్యమిదే. నా జీవితంలోకి అడుగుపెట్టి ఎప్పటికీ నిలిచి ఉండే అద్భుతం నువ్వే. ఇలాగే ఉండిపో. మనస్ఫూర్తిగా నీకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు"

-ఫ్రిదా పింటో, సినీ నటి

'స్లమ్​డాగ్​ మిలీనియర్'​ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందీ భామ. హాలీవుడ్​లో చాలా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కథానాయిక ప్రాధాన్య చిత్రాలతో మెప్పించింది. రెండేళ్ల పాటు ట్రాన్​తో ప్రేమ ప్రయాణం కొనసాగించింది.

Freida Pinto Engaged to Photographer Cory Tran: See the Ring!
అమెరికన్ ఫొటోగ్రాఫర్​ను పెళ్లాడనున్న స్లమ్​డాగ్​ బ్యూటీ

ఇంతకుముందు 'స్లమ్​డాగ్​ మిలినియర్'​ హీరో దేవ్​ పటేల్​తో 2008-2014 వరకు ఆరేళ్లు ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇది చదవండి: 'రూలర్​' టీజర్​తో అదరగొట్టిన బాలకృష్ణ

Kolkata, Nov 22 (ANI): The city of joy-Kolkata is all set to witness historic day-night Test match between India and Bangladesh on November 22. Both the teams will play day-night Test match for the first time with pink ball. Fans have gathered outside Eden Gardens stadium to supports their respective team. Enthusiasm among cricket fans can be seen clearly in Kolkata.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.