శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీసుకు పండగే పండగ. ఎంత లేదన్నా వారానికో కొత్త చిత్రమైనా థియేటర్‌లో సందడి చేసేది. ఒక్కోసారి నాలుగైదు సినిమాలు, ఒక్కోసారి అగ్ర కథానాయకుల చిత్రాలూ పోటీ పడుతుండేవి. ఇప్పుడు కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడ్డాయి. మళ్లీ ఎప్పుడు ప్రేక్షకులతో కళకళలాడతాయో చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో దర్శకనిర్మాతలకు కాస్తో కూస్తో ఓదార్పు ఓటీటీలు. ఇప్పుడు చిన్న చిత్రాల నుంచి స్టార్‌ల సినిమాలు వరకూ వాటిలోనే విడుదలవుతున్నాయి.
ఫలితంగా ఓటీటీ ఛానెళ్లు ఎగబడి మరీ సినిమాలను కొంటున్నాయి. ముందుగానే విడుదల తేదీలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటివరకు థియేటర్లో విడుదలయ్యే చిత్రాల మధ్యే పోటీ ఉండేది. ఇప్పుడు ఓటీటీల్లోనూ ఒకేరోజు నాలుగైదు చిత్రాలు సందడి చేస్తున్నాయి. దీంతో పోటీ నెలకొంది. ఈ నెల ఆఖరి రోజుల్లో జులై 30, 31న నాలుగు బాలీవుడ్ చిత్రాలు నాలుగు వేర్వేరు ఓటీటీ వేదికల్లో విడుదల కానున్నాయి.
-
THE DIGITAL CLASH... As many as *three* #Hindi movies will premiere on 31 July 2020: #ShakuntalaDevi [#AmazonPrime], #RaatAkeliHai [#Netflix] and #Lootcase [#DisneyPlusHotstar]... Wait, there's one more too... #Yaara will premiere one day *earlier* [#Zee5], on 30 July 2020. pic.twitter.com/49jPHsqMCE
— taran adarsh (@taran_adarsh) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">THE DIGITAL CLASH... As many as *three* #Hindi movies will premiere on 31 July 2020: #ShakuntalaDevi [#AmazonPrime], #RaatAkeliHai [#Netflix] and #Lootcase [#DisneyPlusHotstar]... Wait, there's one more too... #Yaara will premiere one day *earlier* [#Zee5], on 30 July 2020. pic.twitter.com/49jPHsqMCE
— taran adarsh (@taran_adarsh) July 17, 2020THE DIGITAL CLASH... As many as *three* #Hindi movies will premiere on 31 July 2020: #ShakuntalaDevi [#AmazonPrime], #RaatAkeliHai [#Netflix] and #Lootcase [#DisneyPlusHotstar]... Wait, there's one more too... #Yaara will premiere one day *earlier* [#Zee5], on 30 July 2020. pic.twitter.com/49jPHsqMCE
— taran adarsh (@taran_adarsh) July 17, 2020
- బయోపిక్స్‌లో అవలీలగా నటించ గల ప్రతిభ విద్యాబాలన్‌కు ఉంది. దేశం గర్వించే గణిత శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవి జీవిత కథతో వస్తోన్న 'శకుంతలా దేవి' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 31న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- విద్యుత్ జమ్వాల్, శ్రుతిహాసన్, విజయ్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'యారా'. తిగ్మన్షు దులియా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఫ్రెంచ్ చిత్రం 'ఏ గ్యాంగ్ స్టోరీ'కి రీమేక్‌గా తెరకెక్కించారు. దీన్ని జీ5లో విడుదల చేస్తున్నారు. నలుగురు స్నేహితుల కథగా నేపాల్ - ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో నడిచే చిత్రమిది. ఇదీ శుక్రవారమే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
- ఓ రాజకీయ హత్యానేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ 'రాత్ అఖేలీ హై'. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా 31నే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవ్వనుంది.
- నిండా డబ్బుతో ఉన్న ఓ సూట్‌కేస్ నేపథ్యంగా సాగే కథతో రూపొందిన వినోద్మాక చిత్రం 'లూట్‌కేస్'. కునాల్ ఖీము కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రాజేష్ కృష్ణన్ తెరకెక్కించారు. ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో 31న ప్రేక్షకుల ముందుకురానుంది.
- ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాను, వీలైన సమయంలో చూసే వెసులుబాటు ఓటీటీల ద్వారా కలిగింది. అయితే ఎంతమంది ఇన్ని ఓటీటీలను సబ్‌స్రైబ్ చేసి సినిమాలూ చూస్తారనేది పెద్ద ప్రశ్న.