'మిషన్ ఇంపాజిబుల్ 7' నుంచి ఐదుగురు సిబ్బంది తప్పుకున్నారు. అందులో నటిస్తున్న హీరో టామ్ క్రూజ్ వారిపై నోరు పారేసుకోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రోమ్‌లో షూటింగ్ సాగుతోంది.
అసలు ఏం జరిగింది?
'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రీకరణను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కొందరు ఫైర్ సిబ్బంది వాటిని అతిక్రమించారు. దీంతో వారిని టామ్ తిట్టారు. అందుకు సంబంధించిన ఆడియో లీకైంది. అదే విషయమై కోపంగా ఉన్న టామ్.. ఇప్పుడు సెట్లో కొందరిపై నోరు పారేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా నుంచి మరో ఐదుగురు సిబ్బంది తప్పుకున్నారు.